Bigg Boss 6 Telugu: Geetu Royal Shares Emotional Post On Bigg Boss Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఓడిపోయాను అంటూ గీతూ ఎమోషనల్‌ పోస్ట్‌.. నెట్టింట వైరల్‌

Published Mon, Nov 7 2022 5:03 PM | Last Updated on Wed, Nov 9 2022 3:48 PM

Bigg Boss Telugu 6: Geetu Royal Pens Heartfelt Note In Social Media - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో ఎక్కువగా మార్మోగిపోయిన కంటెస్టెంట్‌ గీతూ రాయల్‌. మొదటి నుంచీ తన గురించే ఎక్కువ చర్చ జరిగింది. ప్రోమోలు కూడా తన మీదే ఎక్కువగా వచ్చేవి. గేమ్‌ కోసం ఏది చేయడానికైనా రెడీ అంటూ ముందుండేది గీతూ. కానీ గేమ్‌ గెలవడం కోసం ఒకరి మనసును నొప్పించడానికి కూడా వెనుకాడేది కాదు. ఇది చాలామందికి నచ్చలేదు. ఆటలో గెలవడం ముఖ్యం కాదు, ఎలా ఆడామన్నది ముఖ్యమని వాదించారు.

గత రెండు వారాలుగా గీతూ స్వయంగా తనంతట తానే గేమ్‌ను నాశనం చేసుకుంది. నెగెటివిటీ మూటగట్టుకుంది. నన్ను ఏడిపించు చూద్దాం అంటూ పదేపదే సవాలు చేసిన గీతూకు బాధను పరిచయం చేశాడు బిగ్‌బాస్‌. గెలుపు తప్ప ఎలిమినేషన్‌ గురిచి కలలో కూడా ఊహించని గీతూను ఎలిమినేట్‌ చేసి షాకిచ్చాడు. తానిక బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండకూడదన్న ఊహనే భరించలేకపోయింది రాయలక్క. బిగ్‌బాస్‌ను వదిలి ఇంటికి వెళ్లను అంటూ తల్లడిల్లిపోయింది. దీంతో వేరే మనుషులు ఆమెను ఓదార్చుతూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోవాల్సి వచ్చింది.

ఎలిమినేషన్‌ తర్వాత గీతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'నా జీవితంలో బిగ్‌బాస్‌ అత్యంత అందమైన ఫేజ్‌. కానీ అందులో నేను ఓడిపోయాను. మనుషుల విలువ తెలిసింది. నా తప్పులని క్షమించండి ప్లీజ్‌.. నన్ను నన్నుగా అర్థం చేసుకుని సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ చచ్చిపోయేవరకు రుణపడి ఉంటాను' అని రాసుకొచ్చింది.

'మీ అందరినీ నిరాశపర్చినందుకు క్షమించండి. నా వల్ల బిగ్‌బాస్‌ మీద చిరాకు వచ్చిన వాళ్లకు కూడా పెద్ద సారీ' అంటూ ఏడుస్తున్న ఎమోజీలను క్యాప్షన్‌లో జోడించింది. ఈ పోస్ట్‌పై ఆమె అభిమానులు స్పందిస్తూ.. నువ్వు లేని బిగ్‌బాస్‌ షోను ఎలా చూడగలమని కామెంట్లు చేస్తున్నారు. 'ఒక కంటెస్టెంట్‌ వెళ్లిపోతుంటే మా కళ్లల్లో నీళ్లు తిరగడం ఇదే మొదటిసారి', 'అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌', 'మిమ్మల్ని చాలా మిస్‌ అవుతాం' అని విచారం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఇనయను మళ్లీ ఆడుకున్న ఆదిరెడ్డి, నామినేషన్స్‌లో ఎవరెవరంటే?
కంటెంట్‌ క్వీన్‌ గీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement