![Bigg Boss 6 Telugu Latest Promo: Geetu Play WIth Inaya Sulthana - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/6/bigg-boss6.jpg.webp?itok=Qx9DYzKB)
బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. రెండో రోజే గీతూ.. ఇనయ సుల్తానా మధ్య ‘హెయిర్’ వార్ జరిగిన విషయం తెలిసిందే. బాత్రూంలో స్నానం చేసిన వారు అక్కడి హెయిర్‌ని తీసేయాలని గీతూ అంటే..నాతోనే ఎందుకు చెప్తున్నావని ఇనయ సుల్తానా వాగ్వాదానికి దిగింది. నీకు తిక్క అంటే నీకు తిక్క అంటూ ఒకరినొకరు తిట్టుకున్నారు. అది మనసులో పెట్టుకున్న గీతూ.. ఇనయాతో ఓ ఆట ఆడుకున్నటు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది.
(చదవండి: బిగ్‌బాస్‌పై సింగర్ స్మిత సంచలన వ్యాఖ్యలు)
‘క్లాస్.. మాస్.. ట్రాష్’ టాస్క్‌లో ‘క్లాస్’టీమ్‌లోకి వెళ్లిన గీతూ..ట్రాష్ టీమ్‌లో ఉన్న ఇనయాకు చుక్కలు చూపించింది. టాస్క్‌లో భాగంగా గీతూ ఏ పని చెప్తే ఇనయా సుల్తాన ఆ పని చేయాలి. దీంతో ఆమెతో బాటిల్ తెప్పించుకోవడం.. నిమ్మరసం చేయించుకోవడం.. చివరకు దువ్వెనను కూడా తెప్పించుకుంది. అలాగే పాట పాడాలని ఆదేశించగా.. ‘నేను పని చెప్తే చేస్తా కానీ నీ కోసం పాటలు, పద్యాలు పాడను’అని తెగేసి చెప్పింది ఇనయా. ప్రతి చిన్న పనిని ఇనయాతోనే చేయించుకుంటూ ఇంట్లో నవ్వులు పూయించింది. అదే సమయంలో ఇనయాకు మాత్రం విసుగు వచ్చేలా చేసింది. మరి టాస్క్ పూర్తయ్యాక గీతు పరిస్థితి ఏంటో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment