
ఫస్ట్ రౌండ్‌లోనే అవుటైపోయిన గీతూకు నల్ల చేప ఎలా దొరికింది? ఇదెలా సాధ్యమంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్‌ను జంటలుగా విభజించిన బిగ్‌బాస్ చేపల చెరువు అనే టాస్క్ ఇచ్చాడు. మధ్యమధ్యలో కొత్త కొత్త ఛాలెంజ్‌లు కూడా విసురుతున్నాడు. కెప్టెన్సీ బరిలో నిలిచేందుకు జంటలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అయితే గేమ్ చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లోకి ఓ నల్ల చేప వచ్చిందని, దాని సాయంతో రెండు జంటల బాస్కెట్లను స్వాప్ చేయొచ్చని మెలిక పెట్టాడు.
ఇక ఆ నల్ల చేప గీతూకే దొరకగా.. రేవంత్- ఇనయ జోడీల బాస్కెట్‌ను శ్రీహాన్- శ్రీసత్య జంటతో స్వాప్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంత కష్టపడి ఆడితే గీతూ ఒక్క చేపతో తమను గేమ్ నుంచి సైడ్ చేసేయడం ఇనయ, రేవంత్‌కు అస్సలు నచ్చలేదు. ఆ ఫ్రస్టేషన్‌లో వారు ఒకింత కోపం, మరింత బాధతో మాట్లాడుతుంటే దానికి కౌంటర్లిస్తూ ఆనందం పొందింది గీతూ. మొత్తానికి ఈ టాస్క్‌లో గీతూ గేమ్ చేంజర్ అని హాట్‌స్టార్ ట్వీట్ వేస్తే గేమ్ స్పాయిలర్ అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయినా ఫస్ట్ రౌండ్‌లోనే అవుటైపోయిన గీతూకు నల్ల చేప ఎలా దొరికింది? ఇదెలా సాధ్యమంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. ఫైనల్‌గా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో ఎవరు బాగా ఆడారు? ఎవరు కెప్టెన్సీ బరిలో నిలవనున్నారు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే!
Black Fish!
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 26, 2022
Geetu, the game changer.#BBLiveOnHotstar, streaming 24/7.#BiggBossTelugu6 pic.twitter.com/FBiOJMSZmq