
బిగ్‌బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయింది గీతూ రాయల్. బుల్లితెర షోలలోనూ మెరుస్తున్న ఈమె త్వరలో బిగ్‌బాస్ 6లో పాల్గొననుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గీతూ రాయల్ కంటతడి పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారంటూ సుమారు గంటసేపు ఏడ్చింది. 'నన్ను ఇంట్లో వాళ్లతో సహా చాలామంది బాడీ షేమింగ్ చేశారు. అందుకని నేను చాలా వరకు బాడీని కవర్ చేసేలా డ్రెస్సులు వేసుకున్నాను. కానీ ఇటీవలే నా కజిన్స్, ఫ్రెండ్స్‌తో మాట్లాడాను.. నువ్వు ముందు నీ బాడీని ప్రేమించమని చెప్పారు. కానీ, నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నా. జనాలు మీ బాడీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. మనుషుల లుక్స్‌ను బట్టి వారిని అంచనా వేయకండి. దయచేసి బాడీ షేమింగ్ చేయొద్దు' అంటూ ఏడ్చేసింది.
ఈ వీడియో వైరల్‌గా మారగా నువ్వు గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్నును బాడీ షేమింగ్ చేయలేదా? అతడిని తిట్టిపోయలేదా? అని ప్రశ్నిస్తున్నారు షణ్ను ఫ్యాన్స్. దీనిపై ఆమె స్పందిస్తూ.. 'బిగ్‌బాస్ గేమ్ జడ్జ్ చేయడమే నా పని. మా వాడిని అన్నప్పుడు లేదా? అని తిడుతున్నారు. ఆయన బయటకు వచ్చినప్పుడు నేను అతడి పేరు కూడా ఎత్తలేదు. ఎందుకంటే బిగ్‌బాస్ తర్వాత ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేనేదో కావాలని సింపతీ క్రియేట్ చేస్తున్నానంటున్నారు. నాకేమీ చేతకాదు అని ఒప్పుకున్నప్పుడు సింపతీ క్రియేట్ చేస్తా. ఇప్పుడు నాకు చాలా టాలెంట్ ఉంది. నాకీ సింపతీ అక్కర్లేదు.
పాత రివ్యూలను, పాత విషయాలను అలాగే పట్టుకుని వేలాడేవారిని నిబ్బాస్ అంటారు. కొంచెం మారండి' అని ఘాటుగానే సమాధానమిచ్చింది. అయినప్పటికీ ఊరుకోని షణ్ను అభిమానులు మావాడిని బాడీషేమింగ్ చేసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు నిన్ను బాడీ షేమింగ్ చేస్తుంటే బాధేస్తుందా? అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇదిప్పట్లో ముగిసేలా లేదనుకున్న గీతూ రాయల్ చివరగా ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియో షేర్ చేస్తూ.. 'నేను నిజంగా ఎవరినైనా బాడీ షేమింగ్ చేసుంటే ఆ వీడియో పంపించండి. ఒకవేళ అది నిజమైతే బాహాటంగా సారీ చెప్తా' అని చెప్పుకొచ్చింది.
చదవండి: అన్ని కోట్లిస్తామన్న కంపెనీ, కుదరదన్న ఐకాన్ స్టార్
బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment