
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు సంపత్ వినయ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్తే అతడి తమ్ముడు, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ పోలీసులకు దొరికిపోయాడు. సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని డాక్టర్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంపత్‌ను అరెస్ట్ చేసేందుకు అతడి గదికి వెళ్లగా అక్కడ షణ్ముఖ్ గంజాయితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో పోలీసులు అతడిని తీసుకెళ్లారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
2021లోనే రోకా..
తాజాగా ఈ కేసుపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'నేను, షణ్ముఖ్ బాగానే మాట్లాడుకునేవాళ్లం. కానీ అతడు బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు నేనిచ్చిన రివ్యూల వల్ల అతడి కుటుంబానికి, నాకు మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది. షణ్ను అన్నయ్య సంపత్ వినయ్ ప్రేయసి మౌనిక నాకు మంచి స్నేహితురాలు. తను నా ఫీమేల్ క్రష్ కూడా! మౌనిక, సంపత్ చాలా ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. వీరికి 2021లోనే రోకా జరిగింది. ఏడాది తిరిగేలోగా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది.
ఈ నెలాఖరున పెళ్లి.. ఇంతలోనే..
కానీ అంతలోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పెళ్లికి గ్యాప్ తీసుకున్నారు. అంతా సద్దుమణిగాక గతేడాది నవంబర్‌లో పసుపు దంచడం వంటి పెళ్లి పనులు మొదలుపెట్టేశారు. లగ్నపత్రికలు పంచారు, కళ్యాణమండపం కూడా బుక్ చేశారు. ఫిబ్రవరి 28న పెళ్లి జరగాల్సి ఉంది. వారం రోజుల్లో పెళ్లి ఉందనగా సంపత్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడట! ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో లైఫ్ పంచుకోవాలనుకోవడం నాకైతే నచ్చలేదు.
డిప్రెషన్‌లోకి వెళ్లింది
అది ఏ అమ్మాయైనా తట్టుకోలేదు. అందుకనే తనలా చేసి ఉంటుంది. ఏదైనా ఉంటే ఇద్దరూ మాట్లాడుకుని విడిపోవాలి. పైగా ఆమె అతడికి ఇంటికి వెళ్తే లోపలికి రానివ్వకపోవడం కరెక్ట్ కాదు. మౌనిక చాలా సెన్సిటివ్.. తన గురించి ఆలోచిస్తేనే బాధేస్తోంది. ఆ మధ్య తను డిప్రెషన్‌లోకి కూడా వెళ్లింది' అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment