Bigg Boss 6 Telugu: Nagarjuna Fires On Geetu Royal In Weekend Episode - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: గీతూకి క్లాస్‌ పీకిన నాగ్‌..  ఆ విమర్శలకు చెక్‌ పెట్టాలనా?

Published Mon, Oct 3 2022 11:57 AM | Last Updated on Mon, Oct 3 2022 1:02 PM

Bigg Boss 6 Telugu: Nagarjuna Fires On Geetu Royal - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 దసరా ఎపిసోడ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎప్పుడూ చలాకీగా ఉండే గీతూపై నాగార్జున తొలిసారి సీరియస్‌ అయ్యారు. కీర్తి, చంటీల మధ్య అప్పటికే ఒ​క డిస్కషన్‌ జరుగుతుంది. వీరితో నాగార్జున మాట్లాడుతుండగానే గీతూ ఎంట్రీ ఇచ్చి చంటీకీ నెగిటివ్‌గా ఏదో చెప్పబోయింది. దీంతో 'గీతూ వెయిట్.. ఫస్ట్ సీడౌన్.. హే నేను వాళ్లతో మాట్లాడుతున్నా.. నేను మిగతా వాళ్లతో మాట్లాడుతుంటే ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటావు. నీకు ఇది బాగా అలవాటు అయిపోయింది..' అంటూ నాగార్జు ఫైర్ అయ్యారు.

దీంతో ఇంకోసారి ఇలా చేయనంటూ గీతూ సారీ చెప్పింది. అయితే పండగ ఎపిసోడ్‌లో నాగార్జున గీతూపై సీరియస్‌ కావడంపై నెట్టింట చర్చ నడుస్తుంది. హౌస్‌లో మొదటినుంచి గీతూకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారన్న విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు వీకెండ్‌ ఎపిసోడ్‌లోనూ నాగార్జున కూడా గీతూకు సపోర్ట్‌గానే మాట్లాడుతున్నారన్న టాక్‌ కూడా గట్టిగానే వినిపిస్తుంది.

అందుకే కావాలనే నాగ్‌ గీతూకి క్లాస్‌ పీకినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా మిగతా ఎపిసోడ్‌లోతో పోలిస్తే గీతూకి కాసింత ప్రయారిటీ కూడా తగ్గించరని తెలుస్తుంది. చూడాలి మరి గలగలా మాట్లాడే గీతూ ఇప్పుడు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement