
ఒక్కసారి ఆటలో దిగాక తల్లీదండ్రులను కూడా లెక్క చేయనని తేల్చి చెప్పింది గీతూ. తనకు బిగ్‌బాస్ గేమ్ తర్వాతే ఏదైనా అని తెగేసి చెప్పింది. అన్నట్లుగానే గేమ్ కోసం తనకు దగ్గరైనవాళ్లను ఇబ్బంది పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. కానీ ఆమె ఏం చేసినా ఆట కోసమే చేసింది. బిగ్‌బాస్ అంటే అంత పిచ్చి గీతూకు. అయితే గీతూ ఆటతీరు లోపల కంటెస్టెంట్లనే కాదు జనాలను కూడా ఇబ్బంది పెట్టింది. ఒకరి బలహీనతలతో ఆడుకోవడం, కొందరిని టార్గెట్ చేయడం ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. తనకు బుద్ధిబలం ఉన్నా దాన్ని సరిగా వాడుకోలేదు. ఫలితంగా ఈ వారం ఆమె ఎలిమినేట్ అవబోతోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.
ఇందులో హౌస్‌మేట్స్‌తో ఫన్ గేమ్ ఆడించి వారికి రిలాక్స్ చేశాడు నాగ్. అందరినీ సేవ్ చేసుకుంటూ వచ్చాక చివర్లో సత్య, గీతూ ఇద్దరే మిగిలారు. అయితే ఎవరికి వారు తాము సేవ్ అవుతామన్న ధీమాతోనే కనిపిస్తున్నారు. కానీ చివరగా గీతూ ఎలిమినేట్ కానుందన్న విషయం మనందరికీ తెలిసిందే! తను వెళ్లిపోవడంతో ఫైమా, శ్రీహాన్ కంటతడి పెట్టుకున్నారు.
చదవండి: అడ్డంగా దొరికిన ఇనయ, గీతూ వల్ల శ్రీహాన్‌కు పనిష్మెంట్
షాకింగ్, గలాటా గీతూ ఎలిమినేట్
Comments
Please login to add a commentAdd a comment