
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక బిగ్‌బాస్ కెఫెలో యాంకర్ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది గీతూ రాయల్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'తప్పును నిర్భయంగా తప్పని చెప్పే సత్తా నాకుంది. నన్ను అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ జనాలకు నేను నచ్చలేదేమో, నేను మాట్లాడింది రూడ్‌గా అనిపించినట్లుంది. అయినా అందరితో నేను చాలా ప్రేమగానే ఉన్నాను. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. బాలాదిత్యతో సిగరెట్ల విషయంలో నేను తప్పు చేయలేదు. ఆ చిన్న గొడవ వల్ల బయటకు వచ్చానంటే నేను ఒప్పుకోను. అయినా టాప్ టెన్‌లో కూడా లేనంటే నేను ఓడిపోయినట్లే.
ఆదిరెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను ఎంతో బాగా అర్థం చేసుకున్నాడు. మనుషుల గురించి, లైఫ్ గురించి, సమయం గురించి అన్నీ బిగ్‌బాస్‌కు వచ్చాకే తెలిసింది. ఎవరెళ్లిపోతారని ఊరికే గెస్ చేసేదాన్ని. అందరి గురించి రివ్యూలు చెప్పే నేను నా గురించి నేను సరిగా రివ్యూ ఇవ్వలేకపోయాను' అని ఎమోషనలైంది గీతూ. అనంతరం యాంకర్ శివ మాట్లాడుతూ.. షో తర్వాత కూడా ఎవరితో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావు? ఎవరితో చేయకూడదనుకుంటున్నావు? అని అడిగాడు. దీనికి గీతూ బదులిస్తూ.. ఆదిరెడ్డి, శ్రీసత్య, బాలాదిత్య, శ్రీహాన్, ఫైమా, రేవంత్‌లను జీవితాంతం వదలనంది. మెరీనా, రాజ్, ఇనయ, వాసంతి, కీర్తి, రోహిత్‌లతో బంధం ఏమీ వద్దని వారి ఫొటోలు పగలగొట్టింది.
చదవండి: కంటెంట్ క్వీన్ ఎలిమినేట్ అవడానికి కారణాలివే!
బిగ్‌బాస్: బద్ధ శత్రువుల్లా దోస్తులు
Comments
Please login to add a commentAdd a comment