బిగ్‌బాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ సరదాగా సాగింది. తన పుట్టినరోజు సందర్భంగా కేక్ పంపించిన బిగ్‌బాస్.. దాన్ని తినాలంటే మాత్రం ఎంటర్‌టైన్ చేయాలని ఆదేశించాడు. దీంతో ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్లు చేశారు. బిగ్‌బాస్‌ను సంతృప్తి పరిచేందుకు హౌస్‌మేట్స్ తమ టాలెంట్‌తో బాగానే మెప్పించారు. సూర్య మిమిక్రీతో అదరగొడితే, సత్య, శ్రీహాన్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేసింది. ఇక వీళ్లిద్దరి డ్యాన్స్ చూసి అర్జున్ ముఖం మాడిపోయిన దోశ మాదిరి అయిపోయింది.
అందరూ వీరి డ్యూయెట్ చూసి చప్పట్లు కొడుతుంటే అర్జున్ మాత్రం బాగా హర్ట్ అయ్యాడు. ఇక గీతూకు చికెన్ ఆఫర్ చేసిన బిగ్‌బాస్ దాన్ని తినాలంటే గాసిప్ చెప్పాలంటూ ఫిట్టింగు పెట్టాడు. దీంతో సూర్య, ఇనయల మధ్య ఏదో నడుస్తోందని చెప్పిన గీతూ, సత్యను అర్జున్ భయంకరంగా ట్రై చేస్తున్నాడని పేర్కొంది.
ఇక బాలాదిత్య మాటి మాటికీ.. దీపు దీపు అంటుంటే నాకు మండతా ఉంది అని చెప్పగా ‘అంతమంటతో నువ్ ఈ చికెన్‌ని తినలేవులే కానీ.. మాట్లాడి మాట్లాడి బాగా అలిసిపోయినట్టు ఉన్నావ్.. ముందు కొంచెం చికెన్ తిను అన్నాడు బిగ్‌బాస్. ఆ తర్వాత ఫైమాని లోపలికి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. దీంతో ఫైమా కూడా బయట తెగ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మొత్తంగా బిగ్‌బాస్ బర్త్‌డే ఎపిసోడ్ ఇలా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment