![Bigg Boss Telugu 6: Nagarjuna Fun With Geetu Royal - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/16/geetu-royal.gif.webp?itok=QpIUWUx1)
సినిమాలతోనే కాదు రియాలిటీ షో హోస్ట్‌గానూ మెప్పిస్తున్నాడు కింగ్ నాగార్జున. బిగ్‌బాస్ మూడో సీజన్ నుంచి వరుసగా అతడే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో బిగ్‌బాస్ ఓటీటీని కూడా హోస్ట్‌గా రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం నాగ్ ఆరో సీజన్‌ను హ్యాండిల్ చేస్తున్నాడు. అయితే ప్రతి సీజన్‌లోనూ శనివారం క్లాస్ పీకడం, ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేయడం చూస్తూనే ఉన్నాం. నిన్న హౌస్‌మేట్స్‌కు వీడియోలు చూపించి గేమ్ పరంగా ఎవరు బెస్ట్? ఎవరు వేస్ట్? అని చెప్పిన నాగ్ నేడు మాత్రం సరదా ఆటలతో వారిని ఉత్సాహపరిచాడు.
హౌస్‌మేట్స్‌తో బొమ్మలతో పాట గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా స్క్రీన్‌పై ఉన్న బొమ్మలను చూసి అది ఏ పాటో గెస్ చేయాలి. ఇక టాస్కుల కోసం ఏదైనా వస్తువులు అవసరమైతే అవి గీతూ తీసుకురావాలన్నాడు నాగ్. ఆమెకు బద్ధకమని ఆదిత్య చెప్పడంతో కావాలని మరీ గీతూకు పదేపదే పనులు అప్పజెప్పాడు హోస్ట్. దీంతో ఏందిరా నాయనా, సామీ.. అని తల పట్టుకున్న గీతూ తొండి సార్, నాతో ఆడుకుంటున్నారు అని బుంగమూతి పెట్టుకుంది. మరి వీరి ఫన్ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే!
చదవండి: లీకైన ఎలిమినేషన్, ఆమె అవుట్
Comments
Please login to add a commentAdd a comment