Bigg Boss Telugu 6: Second Week Nominations Has Twist With Captain Power | Bigg Boss 6 Telugu Episode 9 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: గీతూతో మాట్లాడటం కూడా అసహ్యం అని చెప్పిన రేవంత్‌

Published Tue, Sep 13 2022 9:20 AM | Last Updated on Wed, Sep 14 2022 10:31 AM

Bigg Boss 6 Telugu: Second Week Nominations Has Twist With Captain Power - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్‌ అంటూ బిగ్‌బాస్‌ ట్విస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండోవారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఇందులో గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో హౌస్‌మేట్‌కు నామినేట్‌ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని బిగ్‌బాస్‌ తెలిపాడు. మరి ఈ ప్రక్రియలో ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారు? చివర్లో బిగ్‌బాస్‌ ఇచ్చిన ట్విస్ట్‌ ఏంటి అన్నది బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-6 తొమ్మిదో ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేద్దాం.

బిగ్‌బాస్‌ రెండోవారం నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌ తాము నామినేట్‌ చేసేవారి పేరు చెప్పి వాళ్ల ఫోటో అతికించి ఉన్న కుండను బావిలో పడేయాలి. మొదటగా ఆరోహి ఆదిరెడ్డిని నామినేట్‌ చేస్తూ అతనితో పెద్దగా బాండింగ్‌ లేదని, ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయినా పర్లేదు అన్న ఉద్దేశంతో నామినేట్‌ చేస్తున్నట్లు చెప్పింది. దీనికి కౌంటర్‌గా హౌస్‌లో గేమ్‌ ఆడనివాళ్లు వెళ్లిపోవాలా లేక నీతో ర్యాపో లేదని వళ్లిపోవాలా అంటూ ఆదిరెడ్డి ప్రశ్నించాడు.

అయితే ఆమెను నామినేట్‌ చేయకుండా మెరీనా అండ్‌ రోహిత్‌లను నామినేట్‌ చేస్తూ సిల్లీ రీజన్‌ చెప్పాడు. అందరిదీ ఒక బుర్ర పనిచేస్తే వాళ్లది రెండు బుర్రలు పనిచేస్తున్నాయని, ఇది బిగ్‌బాస్‌ నిర్ణయం అయినప్పటికీ తాను వాళ్లనే నామినేట్‌ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక ఆ తర్వాత శ్రీహాన్‌ గలాటా గీతుని నామినేట్‌ చేస్తూ ‘ఈ మగాళ్లకి బుద్ధిలేదు అని అన్నావ్.. అందరూ ఏం చేశారు అంటూ నిలదీశాడు. దీంతో గీతూ తన ఉద్దేశం నిజంగా అది కాదని,ప్రతికుక్కకి ఒకరోజు వస్తుందంటే కుక్కకి ఒకరోజు వస్తుందని కాదు జస్ట్ అది స్టేట్ మెంట్’ అంటూ తనను తాను సమర్ధించుకుంది.

ఇక నామినేషన్‌ పక్రియలో గీతూ-రేవంత్‌ల మధ్య మాటల యుద్ధం నడిచింది. నిన్ను నామినేట్‌ చేయాలంటేనే ఛీచీ.. అనే ఫీలింగ్‌ కలిగింది. నీతో మాట్లాడటం కూడా నాకు అసహ్యం.అశుద్దం మీద రాయి వేస్తే మనమీదే పడుతుంది. నీవు అలాంటిదానివే అంటూ రేవంత్‌ గీతూని ఉద్దేశించి మాట్లాడాడు. మొత్తంమీద రెండోవారం జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో కీర్తి, అర్జున్‌, గీతూశేఖర్‌లు రేవంత్‌ను నామినేట్‌ చేయగా, నేహా, చలాకీ చంటీ, సుదీప, ఆర్జే సూర్య, రేవంత్‌లు గీతూను నామనేట్‌ చేశారు.

సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడన్న కారణంతో అభినయ, శ్రీ సత్యలు షానీని నామినేట్‌ చేశారు. తనతో రెండు రోజుల నుంచి సరిగ్గా మాట్లాడటం లేదని, కనీసం చూసి నవ్వడం లేదన్న సిల్లీ రీజన్‌తో వసంతి ఫైమాను నామినేట్‌ చేసింది. చివర్లో కెప్టెన్‌ అయిన కారణంగా ఇద్దరిని డైరెక్ట్‌ నామినేట్‌ చేయాల్సిందిగా బాలాదిత్యకు బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో మీరు బయటకు వెళ్లరనే నమ్మకంతో షానీ, రాజశేఖర్‌లను నామినేట్‌ చేస్తున్నట్లు బాలాదిత్య తెలిపాడు. మరి ఈ వారం నామినేట్‌ అయిన రేవంత్‌, గీతూ, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి,రాజశేఖర్‌,మెరీనా అండ్‌ రోహిత్‌, షానీలలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement