హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘బిగ్‌బాస్‌’ ఫేం శ్రీహాన్‌ | Bigg Boss 6 Telugu: Shrihan New Movie Awara Zindagi Ready To Release | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘బిగ్‌బాస్‌’ ఫేం శ్రీహాన్‌

Published Sun, Oct 2 2022 9:00 AM | Last Updated on Sun, Oct 2 2022 9:00 AM

Bigg Boss 6 Telugu: Shrihan New Movie Awara Zindagi Ready To Release - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో తనదైన ఆటతీరులో అందరిని ఆకట్టుకుంటున్నాడు శ్రీహాన్‌.  ఇనయాతో గొడవ తర్వాత అతనికి ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ లభిస్తోంది. అతను బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు రాకముందే అతని నటించిన కొత్త విడుదలయ్యేలా ఉంది. శ్రీహాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అవారా జిందగి’. జీరో లాజిక్ 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుండటం ఆసక్తికర అంశం. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. 

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ ఆవారా జిందగీ రూపొందుతోంది. ఈ చిత్రానికి నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రతీక్‌ నాగ్‌సంగీతం అందించారు. కామెడీ యాంగిల్‌లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement