బుల్లితెర ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన బిగ్‌బాస్ 6 ఆట షురూ అయింది. అటు కంటెస్టెంట్లు కూడా ఎంతో ఉత్సాహంగా తమ గేమ్‌ను మొదలుపెట్టారు. ఇప్పటికే బిగ్‌బాస్ క్లాస్.. మాస్.. ట్రాష్ అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో క్లాస్‌వాళ్లకు అన్ని అధికారాలు ఉంటాయి. వీరికి ఇంటిసభ్యులతో ఏ పనులైనా చేయించుకునే వీలుంది. అయితే ట్రాష్‌లో ఉండే గీతూ క్లాస్‌లోకి వచ్చీరావడంతోనే ఇనయ సుల్తానాతో సపర్యలు చేయించుకుంది. వీరిని చూసి మిగతావాళ్లు తెగ నవ్వుకున్నారు.
ఇకపోతే తాజాగా బిగ్‌బాస్ రెండో ఛాలెంజ్ విసిరినట్లు కనిపిస్తోంది.ఈ ఛాలెంజ్‌కు ముందో, తర్వాతో తెలీదు గానీ బాత్‌రూమ్ ఏరియాలో రేవంత్ ఏడుస్తూ కనిపించాడు. ఆ తర్వాత ఏం పరిస్థితి తెచ్చావు సామీ? అని కెమెరాల వైపు చూసి మాట్లాడాడు. ఎవరికి వాళ్లు మేమే లీడర్స్ అని ఫీలవుతున్నారని గీతూ అభిప్రాయపడింది. ఇక నేహా, ఇనయ ఓ గేమ్‌లో పోటీపడగా నేహా గెలిచినట్లు తెలుస్తోంది. దీంతో బాధపడ్డ ఇనయ నాకు ఎవ్వరి సపోర్ట్ లేదని అర్థమైందని చిన్నబుచ్చుకుంది. మరోవైపు రోహిత్ తాను చెప్పేది కూడా వినిపించుకోవట్లేదని భర్తపై కస్సుబుస్సులాడింది మెరీనా. వెంటనే తప్పు తెలుసుకున్న అతడు భార్యకు క్షమాపణ చెప్పాడు. అయినా ఆమె అవసరం లేదంటూ విసురుగా వెళ్లిపోయింది. దీంతో తిక్కలేచిన రోహిత్ అన్నింటికీ ఓవరాక్షన్ అంటే వెళ్లిపో అని తిట్టిపోశాడు. మరి భార్యాభర్తల అలక క్షణకాలమేనా? లేదా ఇలా గొడవలతోనే రోజంతా గడిపేస్తారా? చూడాలి!
చదవండి: అది బిగ్‌బాస్ హౌసా? అమీర్‌పేట హాస్టలా: నెటిజన్ల విమర్శలు
బిగ్‌బాస్ చెప్పినా చేయనంతే: గీతూ
Comments
Please login to add a commentAdd a comment