
బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో నామినేషన్ ప్రక్రియ ఈ రోజు మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ప్రతి సీజన్‌లో రెండో రోజే ఇంటి నుంచి బయటకు పంపించడానికి నామినేషన్ ప్రక్రియ షురూ చేసే బిగ్‌బాస్.. ఈ సారి మాత్రం కాస్త ఆలస్యంగా ఆ పనిని మొదలు పెట్టాడు. ఇంట్లో వేస్ట్ అని భావించి ఎవరిని ఫ్లషౌట్ చేయాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా బయటపెట్టండి అని బిగ్‌బాస్ చెప్పడంతో ఇంటి సభ్యులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ నచ్చని వాళ్లని నామినేట్ చేశారు.
(చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో మొగుడు పెళ్లాల కొట్లాట.. వీళ్లేం రొమాంటిక్ కపుల్ రా బాబు!)
ఈ నామినేషన్ ప్రక్రియ ఫైమా, రేవంత్‌ల మధ్య గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫైమా పని చేయడం చూడలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు రేవంత్. అయితే ఫైమా మాత్రం అందుకు అంగీకరించలేదు. ‘నేను పనిచేసేటప్పుడు నువ్వు అటువైపు రాలేదేమో’ అని ఫైమా అంటే.. ‘మే బీ నేను ఇంట్లో లేనేమో.. నాకు ఆ విషయం తెలియదు’అని వెతకారంగా కౌంటర్ ఇచ్చాడు రేవంత్. ఇక అర్జున్ కల్యాణ్ కూడా పని చేయడం చూడలేదంటూ ఫైమాను నామినేట్ చేశాడు. అతనితో కూడా వాగ్వాదానికి దిగింది ఫైమా.
ఇక రేవంత్‌ని నామినేట్ చేసిన ఫైమా.. ‘ఇక్కడ కొంతమంది ఆటకారులు ఉంటారు..కానీ అతను మాటకారి’అని చెప్పుకొచ్చింది. అలాగే గట్టిగా మాట్లాడితే ఆయనదే కరెక్ట్ అనుకుంటాడని చెప్పగా..‘నా వాయిసే ఇంత. మీ గురించి నా వాయిస్ మార్చుకోను’అని రేవంత్ తెగేసి చెప్పాడు. ఫైమాతో పాటు సుదీప, కీర్తిభట్, ఆరోహి కూడా రేవంత్‌ని నామినేట్ చేశారు. మరి ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఎవరు నామినేట్ అయ్యారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment