Bigg Boss 6 Telugu: BB Calls Revanth into Confession Room - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: ఈ గాయం అంత ఈజీగా పోదు: రేవంత్‌ కంటతడి

Nov 10 2022 6:27 PM | Updated on Nov 10 2022 7:24 PM

Bigg Boss 6 Telugu: BB Calls Revanth into Confession Room - Sakshi

ఈరోజు నేను గేమ్‌ ఆడలేకపోయాను. నాలా నేను లేను.. ఆ గాయం అంత ఈజీగా పోదు అని శూన్యంలోకి చూస్తూ మాట్లాడాడు.

కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో అందరూ తన వీక్‌నెస్‌తో ఆడుకోవడంతో రేవంత్‌ బాగా హర్టయ్యాడు. ఫిజికల్‌ కాకపోయినా ఫిజికల్‌ అయ్యానంటూ తనను టార్గెట్‌ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. దీనికి తోడు కెప్టెన్సీ కంటెండర్‌గా తనకు బదులుగా శ్రీహాన్‌.. శ్రీసత్య పేరును సెలక్ట్‌ చేయడాన్ని అతడు జీర్ణించుకోలేనట్లు తెలుస్తోంది. అందుకే ఎవరితో కలవకుండా ఒంటరిగా కూర్చుని తనలో తనే మధనపడుతున్నాడు. స్నేక్‌ అండ్‌ లాడర్‌ గేమ్‌లో అందరికంటే ఎక్కువ మట్టి తెచ్చి సాధించినా కూడా నాకు ప్రతిఫలం అందలేదు. నేను ఓడిపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఈరోజు నేను గేమ్‌ ఆడలేకపోయాను. నాలా నేను లేను.. మనసుకు తగిలిన గాయం అంత ఈజీగా పోదు అని శూన్యంలోకి చూస్తూ మాట్లాడాడు. ఇలా డల్‌గా ఉంటే జనాలకు నచ్చవు, నాతో ప్రాబ్లమ్‌ అయితే చెప్పు, నేను మాట్లాడను అని శ్రీసత్య అనగా నాకు నాతోనే ప్రాబ్లమ్‌ అని ఆన్సరిచ్చాడు రేవంత్‌. తర్వాత బిగ్‌బాస్‌ రేవంత్‌ను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచాడు. మరి కన్ఫెషన్‌ రూమ్‌లో బిగ్‌బాస్‌ రేవంత్‌కు ఏదైనా సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడా? లేదంటే అతడిని ఓదార్చడానికి పిలిచాడా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

చదవండి: పెళ్లి పీటలెక్కబోతున్న నాగశౌర్య
రేవంత్‌కు శ్రీహాన్‌ వెన్నుపోటు పొడిచాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement