Bigg Boss 6 Telugu Today Promo: Vasanthi Krishnan Warning To Revanth In Sunday Funday Episode - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: చెయ్యి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో.. రేవంత్‌కు వాసంతి వార్నింగ్‌

Published Sun, Oct 16 2022 6:48 PM | Last Updated on Sun, Oct 16 2022 7:04 PM

Bigg Boss Telugu 6: Vasanthi Krishnan Warning to Revanth - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ ఆరో వారం ముగింపుకు వచ్చింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఈపాటికే సోషల్‌ మీడియాలో లీకైంది. నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాలో పింకీగా నటించిన సుదీప హౌస​ నుంచి పెట్టే బేడా సర్దుకుని బయటకు వచ్చేయనున్నట్లు తెలుస్తోంది. దానికంటే ముందు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్కులు ఆడించాడు బిగ్‌బాస్‌. అందులో భాగంగా కొన్ని డైలాగులను ఇంటిసభ్యులు ఒకరికొకరు అంకితం చేసుకోవాలన్నాడు.

అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో అన్న డైలాగ్‌ను బాలాదిత్య.. గీతూకు అంకితమిచ్చాడు. చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో, రఫ్ఫాడిస్తా అని రేవంత్‌కు వార్నింగ్‌ ఇచ్చింది వాసంతి. పదేపదే తనను పకోడీ అని పిలుస్తున్నాడంటూ నాగ్‌కు కంప్లైంట్‌ ఇచ్చింది. అందుకే అతడిని కొట్టేస్తానని చెప్పింది.

ప్రతి ఇంట్లో నాలాంటి పిల్ల ఉంటే బాగుండు అనుకునేలా చేస్తానని గీతూ అందో లేదో వద్దు బాబోయ్‌ అని ప్రేక్షకులు దండం పెట్టేశారు.  వారి రియాక్షన్‌ చూసి గీతూ అవాక్కయింది. అయితే హౌస్‌లో కూడా మా అందరిదీ అదే ఫీలింగ్‌ అని పంచ్‌ ఇచ్చాడు రేవంత్‌.

చదవండి: ఉరేసుకుంటానని అప్పుడే హింటిచ్చిన నటి, వీడియో వైరల్‌
గీతూ తిక్క కుదిర్చిన నాగార్జున

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement