
Singer Revanth In Bigg Boss 6 Telugu: సింగర్ రేవంత్.. బిగ్‌బాస్-6 లో 21వ, చివరి కంటెస్టెంట్‌గా రేవంత్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. రావడంతోనే నువ్వు మంచి ప్లే బాయ్ అటకదా అని నాగార్జున అడగ్గా.. ఈ షో తన భార్య చూస్తుందంటూ ఫన్నీగా బదులిచ్చాడు రేవంత్. ముఖ్యంగా తన భార్యను మిస్ అవుతున్నానని చెప్పిన రేవంత్ ప్రస్తుతం ఆమె 6నెలల గర్భంతో ఉన్నట్లు తెలిపాడు. దీంతో స్టేజ్‌పైకి రేవంత్ భార్యను పిలిచి సర్‌ప్రైజ్ చేశారు కింగ్ నాగార్జున. ఇదిలా ఉండగా బాహుబలిలోని మనోహరీ.. పాటతో పాపులారిటీ దక్కించుకున్నాడు.
శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్ బుల్లితెరపై పలు మ్యూజిక్ కాంపిటీషన్స్‌లో పాల్గొన్నాడు. 2017లో సోనీ మ్యూజిక్ చానల్ నిర్వహించే ప్రముఖ పోటీ ఇండియన్ ఐడల్-9లో పాల్గొనడమే కాకుండా టైటిల్ విన్నర్‌గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.కోటి, మణిశర్మ, కీరవాణి, చక్రి, థమన్ లాంటి ప్రముఖ దర్శకుల వద్ద 200కు పైగా పాటలు పాడాడు. ర్యాప్ సింగర్‌గా సింగర్ రేవంత్‌కు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తాడన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment