బిగ్‌బాస్‌: జైలుకు వెళ్లే డిజాస్టర్‌ కంటెస్టెంట్‌ ఎవరంటే? | Bigg Boss Telugu 6: Vasanthi Krishnan Sent To Jail | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఆ కంటెస్టెంట్‌ జైలుకు, రేవంత్‌పై సత్య ప్రతీకారం

Oct 21 2022 8:01 PM | Updated on Oct 21 2022 8:43 PM

Bigg Boss Telugu 6: Vasanthi Krishnan Sent To Jail - Sakshi

ఇవన్నీ చూసిన ప్రేక్షకులు అసలు వీళ్లిద్దరూ ఫ్రెండ్సేనా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను డిజాస్టర్‌ ఎవరో చెప్పమని ఆదేశించాడు.

శ్రీహాన్‌, రేవంత్‌, శ్రీసత్య మంచి ఫ్రెండ్స్‌.. కానీ గేమ్‌లో శ్రీహాన్‌ వల్ల కింద పడ్డా లైట్‌ తీసుకున్న శ్రీసత్య రేవంత్‌ అరుపులకు మాత్రం చిర్రెత్తిపోయింది. అతడితో ఫైట్‌కు దిగింది. నామినేట్‌ చేసినా బయటకు పోలేడు అని అసహనం వ్యక్తం చేసింది. నిన్న ఒక్క టాస్క్‌లోనే కాదు, చాలా సందర్భాల్లో రేవంత్‌కు వ్యతిరేకంగా నిలబడింది. అతడితో గొడవకు అర్జున్‌ను ఉసిగొల్పింది. ఇవన్నీ చూసిన ప్రేక్షకులు అసలు వీళ్లిద్దరూ ఫ్రెండ్సేనా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను డిజాస్టర్‌ ఎవరో చెప్పమని ఆదేశించాడు. శ్రీసత్య ఊహించినట్లుగానే రేవంత్‌ పేరు ప్రస్తావించింది. బిగ్‌బాస్‌ రూల్స్‌ పాటించట్లేదని ఫైర్‌ అయింది. ఇక శ్రీహాన్‌.. మెరీనా పేరును, వాసంతి.. గీతూను, సూర్య, రేవంత్‌ ఇద్దరూ వాసంతిని, అర్జున్‌.. రేవంత్‌ను డిజాస్టర్‌గా పేర్కొన్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ రూల్స్‌ పాటించని రేవంత్‌ తన దగ్గరకు వచ్చి నీతులు చెప్తున్నాడని చిందులు తొక్కింది వాసంతి. మొత్తంగా ఈరోజు వాసంతి జైలుకు వెళ్లినట్లు సోషల్‌ మీడియాలో లీకువీరులు దండోరా వేసి మరీ చెప్తున్నారు. మరి అదెంతవరకు నిజమో తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: అది ప్రాంక్‌ కాదు, నిజమే: రష్మీ
ఆటకు దక్కని ప్రతిఫలం, కన్నీరుపెట్టుకున్న వాసంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement