Bigg Boss 6 Telugu Today Promo: Nagarjuna Questions Inaya Over Her Tongue Slip On Faima - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఓడిపోతే బూతులు అనేస్తావా?: ఇనయ తీరును ఎండగట్టిన నాగ్‌

Nov 12 2022 5:54 PM | Updated on Nov 13 2022 11:07 PM

Bigg Boss Telugu 6: Nagarjun Question Inaya Over Her Tongue Slip - Sakshi

నామినేషన్స్‌లో ఫైమాను అడల్ట్‌ కామెడీ స్టార్‌ అనడం చాలా పెద్ద తప్పని ఇనయను హెచ్చరించాడు. కోపంలో ఏదైనా అనేస్తావా? అని ఆమె తీరును ఎండగట్టాడు. ఆటలో..

తమ్ముడు తమ్ముడే పేకాట పకాటే అనే సూత్రాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌. గేమ్‌ కోసం రిలేషన్స్‌ను పక్కనపెట్టడం ఓకే కానీ తోటి కంటెస్టెంట్లను శత్రువులా టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కోపంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఈ ధోరణి ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌లోనే అధికంగా ఉంది. తాజాగా ఈ వైఖరిని తప్పుపట్టాడు నాగార్జున.

నామినేషన్స్‌లో ఫైమాను అడల్ట్‌ కామెడీ స్టార్‌ అనడం చాలా పెద్ద తప్పని ఇనయను హెచ్చరించాడు. కోపంలో ఏదైనా అనేస్తావా? అని ఆమె తీరును ఎండగట్టాడు. ఆటలో ఓడిపోతే బూతులు మాట్లాడతావా? ఫైమా ప్రొఫెషన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన నిన్ను ఏమని పిలవాలని నిలదీయడంతో ఆమె సమాధానం చెప్పలేక తల దించుకుంది.

ఇక రేవంత్‌ సంచాలక్‌గా చాలా కన్ఫ్యూజ్‌ అయ్యాడని స్వయంగా నాగార్జునే చెప్పుకొచ్చాడు. సంచాలక్‌గా రేవంత్‌ సరిగానే వ్యవహరించాడా? అని నాగ్‌ అడగ్గా ఆదిరెడ్డి ఒక్కడే కరెక్ట్‌గానే ఉన్నాడని ఆన్సరిచ్చాడు. దీంతో హోస్ట్‌.. నీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి అతడు కరెక్టా? అని అడగడంతో ఆది అయోమయం ఫేస్‌ పెట్టాడు. ఇంతలోనే రేవంత్‌ను ఉద్దేశించి.. బిగ్‌బాస్‌ పెట్టిన రూల్స్‌కు వ్యతిరేకంగా వెళ్లొద్దు. సంచాలక్‌గా కన్ఫ్యూజ్‌ అయ్యావు అని అతడికి అర్థమయ్యేలా చెప్పాడు.

చదవండి: వాళ్లది తొండి గేమ్‌, ఫైమాకు వెటకారం ఎక్కువ: కమెడియన్‌
షాకింగ్‌, ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌, వెళ్లిపోయేదెవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement