
ఎప్పుడైతే ఆర్జే సూర్య బయటకు వెళ్లిపోయాడో అప్పటినుంచి గేమ్.. హౌస్ వర్సెస్ ఇనయగా మారింది. గతవారం నామినేషన్స్‌లో ఇనయ హైలైట్ అవగా ఈసారి కూడా అదే జరిగేట్లు కనిపిస్తోంది. అత్యధికంగా ఇనయకు ఎక్కువ నామినేషన్ ఓట్లు పడనున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దోస్తుల మధ్య శత్రుత్వం పెరుగుతున్నట్లుంది. మొన్నటివరకు ఫ్రెండ్స్ అనుకున్న ఫైమా, ఇనయ రోజురోజుకీ బద్ధ శత్రువుల్లా మారిపోతున్నారు. ఈ రోజు గేమ్‌లో కూడా వీళ్లిద్దరూ ఓ రేంజ్‌లో గొడవ పడ్డారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది.
నువ్వు మాట్లాడిన విధానం నచ్చలేదు అని ఇనయ నామినేట్ చేయగా నువ్వు వెనక మాట్లాడేదానివి, ఫేక్ నాన్న.. వెళ్లు అంటూ వెక్కిరించింది ఫైమా. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నేను రియల్‌గా ఉన్నా అని ఇనయ ఆన్సరివ్వగా అసలు ఈ హౌస్‌లో ఎవరికీ నువ్వు నచ్చవని చెప్పింది ఫైమా. ఇక బాధలో ఉండి కూడా ముఖం మీద నవ్వు వస్తుందంటే అది డ్రామా, ఫేక్ అని శ్రీహాన్‌తో గొడవకు దిగింది కీర్తి. మరి ఈ గొడవలు, నామినేషన్స్ ప్రక్రియ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా వేచి చూడాల్సిందే!
చదవండి: నేనిక్కడే ఉంటా బిగ్‌బాస్, గుండె పగిలేలా ఏడ్చిన గీతూ
ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment