![Bigg Boss Telugu 6: Relation Between Inaya Sultana and RJ Surya - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/10/inaya.gif.webp?itok=gKddfPxn)
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రారంభం నుంచి హైలైట్ అవుతున్న కంటెస్టెంట్లలో ఇనయ సుల్తానా ఒకరు. నామినేషన్స్ అంటే చాలు తోక తొక్కిన తాచులా లేస్తుంది. ఆడామగ, చిన్నాపెద్ద తేడాల్లేకుండా అందరినీ ఓ ఆటాడుకుంటుంది. తన మాటలతో ఎదుటివాళ్ల నోటికి తాళం పడేలా చేస్తుంది. అంతటి ఫైర్ బ్రాండ్ అయిన ఇనయ ఈ మధ్య సిగ్గుల మొగ్గవుతోంది. మాటిమాటికీ ముసిముసి నవ్వులు విసురుతూ హగ్గుల్లో ముగినిపోతుంది. సూర్య అంటే క్రష్ అంటూ నిత్యం అతడి నామస్మరణలో తడిసి ముద్దవుతోంది.
బిగ్‌బాస్ హౌస్‌లో పటాకా అనుకుంటే ఫైర్ లేని క్రాకర్‌లా తయారైందేంటి అని తలలు పట్టుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఆరోహి ఉన్నంతవరకు ఆమెనే లోకంగా ఉన్నాడు. ఆమె వెళ్లిపోగానే ఇనయను తగులుకున్నాడు. అటు ఇనయ కూడా తనకెవరూ సపోర్ట్ చేయడం లేదు అనుకుంటున్న సమయంలో సూర్య రావడంతో బాగా కనెక్ట్ అయిపోయింది. అయినదానికీ కానిదానికీ ఇద్దరూ హగ్గులిచ్చుకుంటూ రెచ్చిపోతున్నారు. నిన్న అర్ధరాత్రి అయితే అందరూ పడుకున్న సమయంలో సూర్య.. ఇనయ ఒళ్లో తల పెట్టుకుని నిద్రపోవడం, ఆమె డ్రెస్ సర్దుకోవడం కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు మాకిదేం ఖర్మరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. 'ఇనయ.. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్, కానీ ఈ చెత్త ట్రాక్‌తో తన గేమ్‌ను తానే పాడు చేసుకుంటోంది', 'ఆ హగ్గులు, కిస్సులతో ఇనయ ఇజ్జత్ తీసుకుంటోంది' అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: నామినేషన్స్‌లో 9 మంది..
Comments
Please login to add a commentAdd a comment