'Nata Nata Ratnalu' Lyrical Song Out From Nata Ratnalu Movie - Sakshi
Sakshi News home page

Nata Ratnalu Movie: ఇనయ సుల్తాన 'నటరత్నాలు' సినిమాలో సెకండ్‌ సాంగ్‌ వచ్చేసింది..

Published Wed, Jul 12 2023 12:02 PM | Last Updated on Wed, Jul 12 2023 12:11 PM

Nata Ratnalu Movie: Nata Nata Ratnalu Lyrical Song Out Now - Sakshi

బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తాన, సుదర్శన్, రంగస్థలం మహేశ్‌, తాగుబోతు రమేష్, అర్జున్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నటరత్నాలు. నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ‘నట నట నట నటరత్నాలు.. ఛాన్స్‌ ఇస్తే పండిస్తా నవరసాలు’’ అంటూ సాగే సెకండ్‌ లిరికల్‌ సాంగ్‌ను డా. సుప్రీం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర పాల్గొన్నారు.

శంకర్ మహాదేవ్ స్వరకల్పనలో వినాయక్‌ ఈ పాటను ఆలపించారు. సీతారామ చౌదరి సాహిత్యం అందించారు. దర్శకుడు శివనాగు మాట్లాడుతూ ‘‘కొద్దిరోజుల ముందు తాగుబోతు రమేశ్‌పై తెరకెక్కించిన పాటను విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తాన, సుదర్శన్, రంగస్థలం మహేశ్‌, తాగుబోతు రమేష్, అర్జున్‌ తేజ్‌లపై తెరకెక్కించాం. ఈ పాటకు కూడా స్పందన బాగుంది. సినిమా అవుట్‌పుట్‌ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాం. ఆగస్ట్‌లో మంచి డేట్‌ చూసి సినిమా విడుదల చేస్తాం. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు.

వి.సముద్ర మాట్లాడుతూ ‘‘ఈ టైటిల్‌ వింటుంటే సూపర్‌హిట్టయిన జాతిరత్నాలు సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా ప్రారంభం నుంచి నాకు తెలుసు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. చక్కని ఆర్టిస్ట్‌లు నటించారు. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు. డా.సుప్రీమ్‌ బాబు మాట్లాడుతూ ‘‘సినిమా, పాటలు చూశా. చాలా బాగా వచ్చింది. నాన్న తన చిత్రాలతో ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటారు. ఈ సినిమా కూడా ఆ తరహాలోనే చేశారు’ అన్నారు.

చదవండి: ఆ హీరోయిన్‌ వల్లే విడాకులు... తనను క్షమించేది లేదు: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement