![Bigg Boss Telugu 6: These Are In Nominations For Eighth Week - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/24/bigg-boss-6.gif.webp?itok=O6JvZEyM)
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో మరొక ఎలిమినేషన్ ముగిసింది. ఈసారి అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు సోమవారం కావడంతో మరొకరిని బయటకు పంపించే ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్‌కు సంబంధించి తాజాగా ఒక ప్రోమో రిలీజైంది. ఇందులో గీతూకు, రేవంత్‌కు మధ్య గొడవ మొదలైనట్లు కనిపిస్తోంది. నేను పెరుగు దాచుకుంటే నీకేంటి? అని గీతూతో కొట్లాటకు దిగాడు రేవంత్. మరోపక్క గీతూ.. సేఫ్ గేమ్ పక్కనపెట్టేయండి, ఇక చాలు, ఇప్పటికైనా స్టాండ్ తీసుకోండి అని హౌస్‌మేట్స్‌కు క్లాస్ పీకింది.
నామినేషన్ ప్రక్రియలో ఇనయ, సూర్యకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏడు వారాల తర్వాత నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానని నీకెలా అనిపించిందని రగిలిపోయాడు ఇనయ. అందరికీ సోప్ ఏస్తావు, ఎవరితోనూ గొడవలు లేవు, అదే నీ సేఫ్ గేమ్ అని ఆన్సరిస్తూ అతడిని మరింత ఉడికించింది ఇనయ. ఏ సమయంలో ఎవరితో ఉంటే బాగుంటుంది? అనేట్లుగా ప్రవర్తిస్తున్నావని ఇనయను నామినేట్ చేశాడు ఆది రెడ్డి. మొత్తంగా ఈ వారం ఇంట్లో ఉన్న అందరూ నామినేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే!
చదవండి: అర్జున్ కోసం ఏడ్చిన శ్రీసత్య, ఆమె కోసమే అన్నీ వదిలేసి వచ్చానన్న అర్జున్
నాగార్జున అన్న సపోర్ట్ మర్చిపోలేను: కార్తీ
Comments
Please login to add a commentAdd a comment