బిగ్‌బాస్ రియాలిటీ షో రసవత్తరంగా సాగుతోంది. నాటకీయ పరిణామాల మధ్య ఆర్జే సూర్య కెప్టెన్‌గా అవతరించాడు. నా బావ కెప్టెన్ అయ్యాడోచ్ అంటూ ఇనయ అతడి కంటే ఎక్కువ సంతోషపడుతోంది. అయితే వీళ్ల వ్యవహారం చూసిన నెటిజన్లు.. కంటెంట్ కోసం లవ్వాయణం నడుపుతున్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానాలకు తగ్గట్లుగానే ఒకరికొకరు తినిపించుకోవడం, లాలీపాప్‌ను షేర్ చేసుకోవడం, ఒకరి ఒడిలో మరొకరు తల పెట్టుకుని నిద్రించడం, ముద్దులు, హగ్గులు.. ఇలా ఒకటా? రెండా?.. నానా రకాల చేష్టలతో ప్రేమికుల కంటే కూడా అతిగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఇనయదే తప్పంటూ సీన్‌లోకి ఎంటరైంది సూర్య ప్రేయసి బుజ్జమ్మ. అవును, సూర్యకు బయట గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఈ విషయం ఇనయతో సహా బిగ్‌బాస్ హౌస్‌లో అందరికీ తెలుసు. అయినా నిత్యం సూర్య జపం చేస్తోంది ఇనయ. ఈ వ్యవహారంపై బుజ్జమ్మ మండిపడింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'బుజ్జమ్మ అన్న పేరు నాకు సూర్యనే పెట్టాడు. మేము పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. సూర్య హౌస్‌లో బాగా ఆడుతున్నాడు. టాప్ 5 వరకు రావాలని కోరుకుంటున్నాను. ఆరోహి, సూర్య మంచి ఫ్రెండ్స్. ఒకేచోట కలిసి పనిచేశారు కాబట్టి వారి మధ్య చనువు ఉంది. కానీ అది కాస్త ఓవర్ అయింది. అది జనాలకు నచ్చలేదు. అయితే ఆమె వెళ్లిపోయాక అతడు డిప్రెషన్‌లోకి వెళ్తాడేమో అనుకున్నా. కానీ ఇనయ.. సూర్య తన క్రష్ అని చెప్పి అతడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తోంది. అతడి వెనకాలే తిరుగుతోంది. ఇనయ తన గేమ్‌పై కాకుండా సూర్యపై ఎందుకు శ్రద్ధ పెడుతోంది? అతడికి ఫెవిస్టిక్‌లా అతుక్కుపోయిందేంటని ఆమె ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఇక్కడ సూర్య తప్పు లేదు. ఇనయకు ఇంట్రస్ట్ ఉండి అతడి వెనక పడుతోంది. మరి సూర్యకు అలాంటి ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు' అని చెప్పుకొచ్చింది బుజ్జమ్మ.
చదవండి: మొట్టమొదటిసారిగా బిగ్‌బాస్ షోలో కర్వాచౌత్
ఇంత ద్వేషమా? అతడు చచ్చిపోయేలా ఉన్నాడు: నటి
Comments
Please login to add a commentAdd a comment