
ఎంత కష్టపడినా కొందరికి అంత ఈజీగా విజయాలు వరించవు. కష్టానికి తోడు ఆవగింజంత అదృష్టం కూడా ఉండి తీరాలి. అది ఉన్నప్పుడే సక్సెస్ సాధ్యమవుతుంది. అయితే వచ్చిన సక్సెస్‌ను, క్రేజ్‌ను కాపాడుకోవడం కూడా ఇప్పటి పరిస్థితుల్లో చాలా కష్టంగా మారింది. కొందరు అలా మెరిసి ఇలా మాయమవుతున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా కూడా ఇదే కోవలోకి వస్తుంది. సినిమాల మీద పిచ్చితో కన్నవారిని, ఇంటిని వదిలేసి ఫిలింనగర్‌కు పారిపోయి వచ్చేసింది.
బిగ్‌బాస్ తర్వాత మారని రాత
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కింది ఇనయ. తర్వాత బిగ్‌బాస్ షోలోనూ అడుగుపెట్టింది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఇనయ సుల్తానా.. ఈ రియాలిటీ షో తర్వాత ఎన్నో ఆఫర్లు వస్తాయనుకుంది. అనుకున్నదొక్కటైతే అయినది మరొక్కటి.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎలాగైతే అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిందో ఇప్పుడు కూడా అలాగే ఛాన్సులు ఇవ్వమని అడుగుతోంది. కానీ ఆమె మొర ఆలకించేవారే లేదు. ఇలాగైతే పని కాదనుకుందో ఏమో కానీ పూజారి వేణుస్వామిని కలిసి ప్రత్యేక పూజలు చేయించుకుంది.
నువ్వు గుడిలో పూజలు చేస్తున్నావా?
ఈ క్రమంలో మెడలో పూల మాల వేసుకుని భక్తితో మునిగిపోయిన ఆమెపై వేణుస్వామి కలశంతో నీళ్లు చల్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇనయ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన జనాలు 'ఏంటి? పూజ చేయగానే ఫేమస్ అయిపోతాననుకుంటున్నావా?', 'వెంటనే హీరోయిన్‌గా పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇస్తారనుకుంటున్నావా?', 'ఇలాంటివన్నీ ఎలా నమ్ముతారసలు?' అని సెటైర్లు వేస్తున్నారు. ఒకరైతే 'నువ్వు ముస్లిం కదా.. పూజలు చేస్తున్నావేంటి?' అని అడగ్గా.. 'నేను భారతదేశంలో ఉన్నాను. ఇక్కడ నాకు నచ్చింది చేయగలిగే స్వేచ్ఛ ఉంది. మధ్యలో నీకేంటి సమస్య?' అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment