![Bigg Boss 6 Telugu: Inaya Upset Locks Herself In Washroom - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/2/bb.jpg.webp?itok=Ib9fH7KG)
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 9వ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్‌లో హౌస్‌మేట్స్ అంతా ఇనయాను టార్గెట్ చేశారు. ఆమె పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తూ హేళన చేశారు. ముఖ్యంగా సూర్య విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. దీంతో ఇనయా మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. నామినేషన్స్ పూర్తవ్వగానే బాత్ రూమ్‌లోకి వెళ్లి బోరున ఏడ్చింది. చాలా గిల్టీగా ఉంది బిగ్‌బాస్.. నా వల్ల కావడం లేదు అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. దీంతో హౌస్‌మేట్స్ అంతా వాష్‌రూమ్ దగ్గరకు వెళ్లి బయటకు రావాలని కోరారు. తాను బయటకు రాలేనని, ఒక్కసారి బిగ్‌బాస్‌తో మాట్లాడాలని ఇనయా డిమాండ్ చేసింది. అయితే బిగ్‌బాస్ నుంచి ఎలాంటి ఆదేశం రాకపోవడంతో.. రేవంత్ వాష్‌రూం డోర్‌ని పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బిగ్‌బాస్ నుంచి ఇనయాకు పిలుపు వచ్చింది.
కన్ఫేషన్ రూంలోకి వెళ్లిన ఇనయా.. తన బాధనంతా బిగ్‌బాస్‌తో చెప్పుకుంది. ‘నా లైఫ్‌లో చాలా గిల్ట్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీళ్లు వేసే నిందలు భరించలేకపోతున్నాను. నా వల్లనే సూర్య వెళ్లిపోయాడు అనడాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. నాకు ఇక్కడ ఉండాలని లేదు.నాకు నచ్చిన వాళ్లంతా నా నుంచి దూరమవుతుంటారు’అంటూ వెక్కివెక్కి ఏడ్చింది.
అప్పుడు బిగ్‌బాస్ ఇనయాను ఓదారుస్తూ.. ‘ఈ హౌస్‌లోకి రావడం.. వెళ్లిపోవడం అనేది ఆటలో ఒక భాగం.ఇక్కడికి రావడం మాత్రమే ఆటగాళ్ల చేతిలో ఉంటుంది. బయటకు వెళ్లడం అనేది ప్రేక్షకులు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మీరు మీ జీవితంలో చాలా చూశారు. నవ్వుతూ ఉండే ఒక అమ్మాయిగా ఈ ఇంట్లోకి వచ్చిన ఇనయాని..తనకు బాగా దగ్గరైన వాళ్లు ఇలా చూడాలని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. లేదు బిగ్‌బాస్ అని ఇనయా చెప్పింది. మీరు మీ కన్నీళ్లును తూడ్చుకొని బయటకు వెళ్లండి అని బిగ్‌బాస్ చెప్పడంతో ఇనయా నవ్వుతూ బయటకు వచ్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment