'కృతిశెట్టి, శ్రీలీల మాదిరి నేనూ చేసుంటే ఛాన్సులు వచ్చేవి' | Bigg Boss Inaya Sultana Comments On Movie Chance | Sakshi
Sakshi News home page

Inaya Sultana: కృతిశెట్టి, శ్రీలీల మాదిరి నేనూ చేసుంటే ఛాన్సులు వచ్చేవి: బిగ్‌ బాస్‌ బ్యూటీ

Published Fri, Nov 10 2023 7:52 AM | Last Updated on Sat, Nov 18 2023 1:40 PM

Bigg Boss Inaya Sultana Comments On Movie Chance - Sakshi

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఇనయా సుల్తానా.. టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వర్మతో ఒక పార్టీలో డ్యాన్స్‌ చేస్తూ కనిపించి భారీగా వైరల్‌ అయింది. ఆ ఒక్క వీడియో వల్ల ఆమెకు బిగ్‌ బాస్‌ సీజన్‌ 6లో ఛాన్స్‌ వచ్చింది. అక్కడ తన టాలెంట్‌తో ఎలాంటి నెగటివిటీ లేకుండానే ఆటలో కొనసాగింది. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది.  బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక అవకాశాలు వరుస కడతాయని ఆశించినా ఫలితం దక్కలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇనయా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

సినిమా ఇండస్ట్రీలో కొంత మంది అమ్మాయిలు టీనేజ్‌లోనే స్టార్‌ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. 16, 17 ఏళ్ల వయసులోనే వారు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కృతిశెట్టి, శ్రీలీల వంటి వారు కూడా  ఆ వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ నేను 22 ఏళ్లకు సినీ పరిశ్రమలోకి వచ్చాను. వాళ్లతో కంపేర్‌ చేస్తే నేను 7 ఏళ్లు వృధా చేసుకున్నాను. వాళ్ల మాదిరి నేను కూడా ముందే ఇండస్ట్రీలోకి వచ్చుంటే నా లైఫ్‌ మరోలా ఉండేదని అనుకుంటున్నా.. కానీ ప్రస్తుతం వాటి గురించి పట్టించుకోను.' అని ఇనయా తెలిపింది.

ఈ ఫోటోలు శాంపిల్స్‌ మాత్రమే.. అన్నీ పోస్ట్‌ చేస్తే అంటూ..

'ప్రస్తుతం మనం 60 ఏళ్లకు మించి బతకడం కష్టం. ఎప్పుడు ఉంటామో.. పోతామో..? ఎవరికీ తెలియదు. ప్రస్తుతం నా వయసు 25. దేవుడు దయ వల్ల మహా అయితే మరో 25 ఏళ్లు బతుకుతానేమో. ఈ జీవితంలో నేను ఎంజాయ్‌ చేసేది మాగ్జిమమ్‌ 10 - 15 ఏళ్లు మాత్రమే! ఆ తర్వాత ఎంజాయ్‌ చేద్దామని ఉన్నా మనకు బాడీ కూడా సహకరించదు. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న టైమ్‌లోనే ఆనందంగా గడుపుతున్నాను. షోషల్‌ మీడియాలో నేను పోస్ట్‌ చేసే ఫోటోలు శాంపిల్స్‌ మాత్రమే... ఇంకా నా దగ్గర మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయి. అవన్నీ పోస్ట్‌ చేస్తే ఏమైపోతారో..?' అంటూ చివరగా హాట్‌ కామెంట్‌ చేసింది.

ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసులు తిరిగాను
బిగ్‌బాస్‌ నుంచి వచ్చాక మంచి అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ ఎలాంటి ఛాన్స్‌లు దొరకలేదని ఇనయా తెలిపింది. సినిమా ఛాన్స్‌ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ  ఒక్క ఆఫర్‌ కూడా రాలేదు. కానీ అలాంటి సమయంలో కూడా తాను ఎలాంటి డిప్రెషన్ లోకి వెళ్లలేదని ఇలా తెలిపింది.  ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. సినిమాల్లో స్థిరపడాలనే కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అడుక్కున్నట్లుగానే అవకాశాల కోసం అడుక్కున్నప్పటికి ఫలితం లేకుండా పోయిందని ఇనయా సుల్తానా తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement