ఎప్పుడైతే వెళ్లిపోండి అని బిగ్‌బాస్ గేట్లు ఓపెన్ చేశాడో అప్పటినుంచి శ్రద్ధాసక్తులతో గేమ్ ఆడుతున్నారు కంటెస్టెంట్లు. ఈ క్రమంలో గెలవడం కోసం ఏదైనా చేస్తున్నారు. కొందరు అడ్డదారిన ఆడుతుంటే, మరికొందరు నీతిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగార్జున మాత్రం గెలవడం కోసం ఎలా ఆడినా తప్పు లేదని వెనకేసుకొస్తున్నాడు. కానీ ఆటలో లిమిట్స్ దాటిన కొందరికి ఆల్‌రెడీ క్లాస్ పీకాడు నాగ్. ఈరోజు సండే కావడంతో హౌస్‌మేట్స్‌తో ఫన్ గేమ్స్ ఆడించనున్నాడు. అంతేనా? మళ్లీ వాళ్ల మనసులోని భావాలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నాడు.
ఈ ఆటలో మిమ్మల్ని పాములా కాటేస్తుంది ఎవరు? నిచ్చెనలా ముందుకు వెళ్లేందుకు సాయపడుతుంది ఎవరు? అని అడిగాడు నాగ్. ముందుగా ఫైమా.. ఇనయ తనను స్నేహం పేరుతో కాటేసిందని చెప్పింది. రేవంత్.. వాసంతిది పాము కళ్లు అన్నాడు. ఇక ఇనయతో మాట్లాడుతూ.. నీ మనసులో ఉంది నాకు తెలుసు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో తెలుసు అంటూ బిగ్‌బాస్‌ను సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయమన్నాడు నాగ్. దీంతో ఆమె ఎంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్లింది. కానీ ఇదంతా ఉట్టి నాటకం అని తెలుస్తోంది. పాపం ఇనయ... తనను ప్రాంక్ చేశారని తెలిశాక ఎలా ఫీలైందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే!
చదవండి: షాకింగ్ ఎలిమినేషన్, గీతక్క గుడ్‌బై
ఆదిపురుష్‌పై అదనంగా వెయ్యి కోట్ల భారం
Comments
Please login to add a commentAdd a comment