సరదా సరదాగా..
యూకేలో చదవడానికి కోర్స్ కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ పంపిస్తే ఈ బుల్లోడు యూక్షన్, కెమెరా అని షార్ట్ కట్‌గా హిట్ కొట్టేవాడు. సినివూల మీద ప్రేమతో స్నేహితులతో కలసి షార్ట్ ఫిల్మ్స్ ట్రాక్ ఎక్కేశాడు. రాయులసీవు యూస పండించి యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాడు. ఇతగాడు నటించిన ఐదు లఘు చిత్రాలు యూట్యూబ్‌లో ఐదు లక్షలకు పైగా హిట్స్ సాధించాయి. ప్రస్తుతం ప్రముఖ హీరోల సినివూల్లో నటిస్తూ సెల్యులారుడ్ స్క్రీన్‌పై బిజీ అయిపోయూడు సుదర్శన్‌రెడ్డి. నెల్లూరుకు చెందిన సుదర్శన్‌రెడ్డి తిరుపతిలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
కాలేజీ రోజుల్లోనే ఫ్రెండ్స్‌తో సరదాగా నాటకాలు వేస్తూ టాక్ ఆఫ్ ది కాలేజ్‌గా ఓ వెలుగు వెలిగాడు. స్పాంటేనిటీతో అందర్ని నవ్వుల్లో వుుంచెత్తేవాడు. తల్లిదండ్రులకేమో సుదర్శన్‌ను యూకేలో చదివించాలని ఆశ. సుదర్శన్ స్నేహితుడు శ్రీకాంత్ హైదరాబాద్‌లో డెరైక్షన్ కోర్స్ చేస్తూ షార్ట్‌ఫిల్మ్స్ తీసేవాడు. అలా స్నేహితులు రూపొందించిన ‘నాకు కోపం వచ్చింది’ అనే షార్ట్‌ఫిల్మ్ సుదర్శన్‌కు కమెడియున్‌గా వుంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
తర్వాత ‘అమెరికాకు దారేది’, ‘ఇదిగో ప్రియాంక’, ‘ఓఎల్‌ఎక్స్’ లాంటి షార్ట్‌ఫిల్మ్స్ యుూట్యూబ్‌లో లక్షల హిట్స్ సాధించారు. సుదర్శన్ పలికించే సీవు యూస నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అలా బుల్లి చిత్రాలతో కెరీర్ ఆరంభించిన సుదర్శన్.. ఇటీవల రన్ రాజా రన్ చిత్రంలో నటించాడు. నాగచైతన్య చేస్తున్న వురో చిత్రం, తమిళ్ హీరో మహత్ నటిస్తున్న ద్విభాషా చిత్రంతో పాటు పలు ప్రముఖ హీరోల సినివూల్లోనూ చాన్స్ కొట్టేశాడు. సుదర్శన్ వుంచి నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆశిద్దాం.