ఓర్వకల్లు, న్యూస్‌లైన్: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా కొత్తగా జాబితాలో చేరిన పేర్లను ఆన్‌లైన్ చేయాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఓటర్ల సవరణ జాబితా పరిశీలన కోసం శుక్రవారం ఓర్వకల్లు తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఓబులేసుతో కలిసి స్థానిక రెవెన్యూ అధికారులతో కొద్దిసేపు సమీక్షించారు. గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ 23 వరకు బీఎల్‌ఓల ద్వారా సేకరించిన కొత్త ఓటర్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి కంప్యూటర్‌లో పొందుపరచాలన్నారు.
ఏ మాత్రం పొరపాటు జరిగినా సాధారణ ఓటర్లు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మండలంలో కొత్తగా ఓటు హక్కు కోసం 2199 మంది దరఖాస్తు చేసుకోగా 266 దరఖాస్తులను బోగస్‌గా గుర్తించి తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం మండలంలో 40,664 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనాథ్, ఆర్‌ఐ శ్రీనివాసులు, వివిధ గ్రామాల వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా ఆన్‌లైన్ చేయండి
Published Sat, Jan 11 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement