హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ రచించిన పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. 'గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం' పేరుతో రచించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టీస్ సుదర్శన్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రొఫెసర్ కోదండరామ్, 'సాక్షి' ఈడీ కే రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే విభజనకు అర్థముంటుందన్నారు. హైకోర్టు విభజన బాధ్యత కేంద్రానిదే అన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్కు ఆత్మహత్యాసదృశమే అని జైరాం రమేష్ పేర్కొన్నారు.
అయితే.. డిసెంబర్ 9 ప్రకటన తరువాత తెలంగాణపై కాంగ్రెస్ ఎందుకు వెనక్కిపోయిందో జైరాం రమేష్ రాయలేదని కే రామచంద్రమూర్తి అన్నారు. ఇకపోతే.. అదిష్టానాన్ని కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినప్పటికీ అతణ్ని సీఎం పదవి నుంచి ఎందుకు తొలగించలేదో కూడా జైరాం రమేష్ చెప్పలేదన్నారు.
గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం పుస్తకావిష్కరణ
Published Sun, Jul 17 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
Advertisement
Advertisement