బాబు అవినీతిపై అమెరికాలో పుస్తకం విడుదల | YSRCP releases Book on Chandrababu in US | Sakshi
Sakshi News home page

బాబు అవినీతిపై అమెరికాలో పుస్తకం విడుదల

Published Sat, May 14 2016 7:56 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

YSRCP releases Book on Chandrababu in US


పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో పుస్తకాన్ని అవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్: రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడిన అంశాలతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 'అవినీతి చక్రవర్తి చంద్రబాబు' పుస్తకాన్ని పార్టీ ఎన్నారై విభాగం శుక్రవారం అమెరికాలో ఆవిష్కరించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫోర్లిడా రాష్ట్రంలోని ఒర్లాండ్ నగరంలో పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు.

రాజధాని పేరుతో విలువైన భూమలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనునూయులకు కట్టబెడుతున్నారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే విదేశీ పర్యటనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న విషయాలను ఎమ్మెల్యే ఎన్నారై ప్రతినిధులకు వివరించారు. అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఎన్నికల ముందు చెప్పిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు పూర్తి చేయలేదని వారి దృష్టికి తీసుకొచ్చారు. విభజన సమయంలో రాష్ట్రానికి లభించిన ప్రత్యేక హోదా హామీ సాధించడంలోనూ ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఎన్నారై పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అమెరికా దక్షిణ ఎన్నారై విభాగం పార్టీ ఇన్‌చార్జి నలిపిరెడ్డి వాసుదేవరెడ్డి, కొండా మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement