కాలనీ ఏర్పాటు ప్రశంసనీయం | collector greetings to adoni division revenue association | Sakshi
Sakshi News home page

కాలనీ ఏర్పాటు ప్రశంసనీయం

Published Mon, Dec 16 2013 6:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM

collector greetings to adoni division revenue association

ఆదోని, న్యూస్‌లైన్: ప్రభుత్వ చేయూత కోసం ఎదురు చూడకుండా సొంతంగా కాలనీ ఏర్పాటుకు ఆదోని రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ నాయకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కలెక ్టర్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. కాలనీ ఏర్పాటుకు సంబంధించి స్థానిక విజయభాస్కరరెడ్డి కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆదివారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రెవెన్యూ ఉద్యోగులు, కుటుంబ సభ్యులనుఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హైదరాబాదు, కర్నూలుతోపాటు పలు ప్రాంతాల్లో రెవెన్యూ అసోసియేషన్‌కు ప్రభుత్వం స్థలాలు కేటాయించినా కోర్టు కేసుల కారణంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. 
 
 ఈ నేపథ్యంలో ఆదోని అసోసియేషన్ సభ్యులు సొంతంగా పదెకరాలు కొనుగోలు కాలనీ ఏర్పాటుకు పూనుకోవడం గొప్ప విషయమన్నారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే స్థానిక ఆర్డీఓ సహకారంతో రోడ్లు, మంచినీటి పైపులైను ఏర్పాటయ్యాయని, ఇతర వసతుల కల్పనకు తన సహకారం ఉంటుందన్నారు. అంతకుముందు పట్టణలోని రెవెన్యూ భవన్‌ను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రారంభించారుఆదోని, న్యూస్‌లైన్: ప్రభుత్వ చేయూత కోసం ఎదురు చూడకుండా సొంతంగా కాలనీ ఏర్పాటుకు ఆదోని రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ నాయకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కలెక ్టర్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. కాలనీ ఏర్పాటుకు సంబంధించి స్థానిక విజయభాస్కరరెడ్డి కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆదివారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రెవెన్యూ ఉద్యోగులు, కుటుంబ సభ్యులనుఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హైదరాబాదు, కర్నూలుతోపాటు పలు ప్రాంతాల్లో రెవెన్యూ అసోసియేషన్‌కు ప్రభుత్వం స్థలాలు కేటాయించినా కోర్టు కేసుల కారణంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. 
 
 ఈ నేపథ్యంలో ఆదోని అసోసియేషన్ సభ్యులు సొంతంగా పదెకరాలు కొనుగోలు కాలనీ ఏర్పాటుకు పూనుకోవడం గొప్ప విషయమన్నారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే స్థానిక ఆర్డీఓ సహకారంతో రోడ్లు, మంచినీటి పైపులైను ఏర్పాటయ్యాయని, ఇతర వసతుల కల్పనకు తన సహకారం ఉంటుందన్నారు. అంతకుముందు పట్టణలోని రెవెన్యూ భవన్‌ను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకమని, అయితే హక్కులతోపాటు బాధ్యతలను గుర్తెరిగి పనిచేస్తే మనల్ని ప్రశ్నించేవారుండరన్నారు. 
 
 ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు అంగీకరించిందని, అవి భర్తీ అయితే ఒత్తిడి తగ్గుతుందన్నారు. డివిజన్‌లోని రెవెన్యూ ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేస్తున్న అసోషియేషన్ ఆదోని శాఖను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార ్యదర్శి శివకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడారు. పదెకరాల్లో 150 మందికి  ప్లాట్లు వేశామని, మిగిలిన వారికి త్వరలోనే స్థలం సేకకరిస్తామని అసోసియేషన్ ఆదోని డివిజన్ శాఖ అధ్యక్షుడు రజనీకాంత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీఎండీ హుసేన్, జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్, ఆదోని ఆర్డీఓ రాంసుదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేషనల్, అక్షర శ్రీ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. . ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకమని, అయితే హక్కులతోపాటు బాధ్యతలను గుర్తెరిగి పనిచేస్తే మనల్ని ప్రశ్నించేవారుండరన్నారు. 
 
 ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు అంగీకరించిందని, అవి భర్తీ అయితే ఒత్తిడి తగ్గుతుందన్నారు. డివిజన్‌లోని రెవెన్యూ ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేస్తున్న అసోషియేషన్ ఆదోని శాఖను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార ్యదర్శి శివకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడారు. పదెకరాల్లో 150 మందికి  ప్లాట్లు వేశామని, మిగిలిన వారికి త్వరలోనే స్థలం సేకకరిస్తామని అసోసియేషన్ ఆదోని డివిజన్ శాఖ అధ్యక్షుడు రజనీకాంత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీఎండీ హుసేన్, జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్, ఆదోని ఆర్డీఓ రాంసుదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేషనల్, అక్షర శ్రీ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement