గాంధారి, న్యూస్‌లైన్ : పేదల సంక్షేమం కోసం పాటు పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మం త్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మూడో విడత రచ్చబండ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గత కాంగ్రేసేతర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. జి ల్లాలో గృహనిర్మాణాల కోసం రూ. 500 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మండలంలో 119 మంది ఆడ పిల్లలు బంగారు పథకంలో చేరారని, వారి పేర్లపై బ్యాంకుల్లో ఒక్కొక్కరికి రూ. 42 వేలు డిపాజిట్ చేసినట్లు చెప్పారు. కొత్తగా 1,353 మందికి రేషన్ కార్డులు మంజూరైనట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుతో కామారెడ్డి డివిజన్ సస్యశ్యామలంగా మారుతుందన్నారు.
తాగడానికి గోదావరి జలాలు: సురేష్ శెట్కార్, ఎంపీ
మండలంలో గిరిజనులు అధికంగా ఉన్నారని, మారుమూల గ్రామాలు, తండాలు వెనుకబడి ఉన్నాయన్నారు. తాగు నీటి ఎద్దడి అధికంగా ఉందని, ఈ సమస్య పరిష్కారం కోసం గోదావరి జలాలను సరఫరా చేయడానికి రూ.16 కోట్లు విడుదలయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు.
ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు: ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి
అందకు ముందు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు ప్రచారం ఎక్కువ పని తక్కువ అని విమర్శించారు. పింఛన్లు, గృహ నిర్మాణాల కోసం వేలల్లో దరఖాస్తులు వస్తే, రేషను కార్డులు, పింఛన్లు నామమాత్రంగా మంజూరు చేశారని ఆరోపించారు. ఇళ్లు నిర్మించుకున్నవారు బిల్లులు రాక అధికారులు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
Published Thu, Nov 14 2013 3:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement