
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్‌రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. నూతన సీఈవోగా నియమితులైన సుదర్శన్‌రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.
కాగా, తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వికాస్ రాజ్ నిర్వహించగా, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వికాస్ రాజ్‌ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా ఈసీ నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment