అత్యున్నత కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతా
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థను రాష్ట్రంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతానని చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. అందరూ గర్వపడేలా అవినీతిరహిత కార్పొరేషన్‌గా పేరొచ్చే లా పనిచేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారి ఆయన సంస్థ కార్యాలయానికి వచ్చారు. ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలసి ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలన వారసత్వాలను విడిచి రాష్ట్ర ప్రభుత్వ అంచనా లకు తగినట్లుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులకు సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రభుత్వం, ప్రజలు ప్రశంసించేలా కార్పొరేషన్ పనితీరు ఉండాలని, ఇందుకోసం ఉద్యోగులంతా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలన్నారు. కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ.. రూ.వేల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేషన్‌లో సరైన సిబ్బంది, విభాగాలు లేవని, ఫైనాన్‌స, ఐటీ, టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.