![నియోజకవర్గానికి 2,360 ‘డబుల్’ గృహాలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81489180266_625x300.jpg.webp?itok=RWCZU2oX)
నియోజకవర్గానికి 2,360 ‘డబుల్’ గృహాలు
రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 2,360 డబుల్ బెడ్‌రూం గృహాలు మంజూరయ్యాయని రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించనుందని పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్.రవి ఆధ్వర్యాన శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1400 డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు కాగా నగర పంచాయతీకి అదనంగా 960 మంజూరయ్యాయని తెలిపారు.
రాజకీయాలకతీతంగా అర్హులకు గృహాలు మంజూరు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత పట్టణంలో ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలపై ఆయన ఆరా తీశారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచందర్, తహసీల్దార్ శంకర్‌లింగం, పాల్గొన్నారు.