నీటికి కటకట
‘కూటి కోసం కోటి తిప్పలు’ అన్నారు పెద్దలు. ఇప్పుడు ‘నీటి కోసమూ కోటి తిప్పలు’ పడుతున్నారు సామాన్యులు. ప్రచండ భానుడు నిప్పులు కక్కుతుండటంతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటారుు. గతేడాదితో పోల్చితే బావులు, బోర్లలో నీటిమట్టాలు పడిపోయూరుు. దీంతో తెల్లారింది మొదలు పల్లె ప్రజలు బిందెలు చేతపట్టి, వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీయూల్సిన దుస్థితి నెలకొంది. ఇక పట్టణాల్లో జ(న)ల ఘోషను వినే నాథుడే లేకుండాపోయూడు. ఇప్పటికైనా పాలకులు మేల్కొని కనీస అవసరంగా చెప్పుకునే నీటి కొరతతో జనం ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చే దిశగా అడుగులేయూలి. - నర్సంపేట
నర్సంపేట నియోజకవర్గంలో 3 లక్షల జనాభా ఉంది. ఒక్కొక్కరికి సగటున రోజుకు 3.5 లీటర్ల నీటిని సరఫరా చేయూలని ప్రపంచ ఆరో గ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) అంటోంది. కానీ ఒక్కొక్కరికి కనీసం రోజువారీగా లీటరు నీటిని కూడా సరఫరా చేయడం లేదు. కనీస అవసరమైన తా గునీటి సరఫరాపై పాలకులకు ఉన్న నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం. నీటి కటకటను తీర్చే దిశగా ఇప్పటికైనా కృషిచేయాల్సిన అవసరముంది.
డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టుకు నిధులేవీ ?
ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారులో 2004 సంవత్సరంలో రూ.3.74 కోట్లు వెచ్చించి డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టును నిర్మించారు. నర్సంపేట డివిజన్లోని 132 గ్రామాలు, శివారు ప్రాంతాల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత నీటిని అందించాలనే సంకల్పంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పడకేసింది. గతేడాది మార్చి 1న ఇది మూతపడింది. దీంతో శివారు గ్రామాల ప్రజలు ఉదయం లేచింది మొదలు నీటి కోసం చేదబావుల వద్దకు పరుగుతు తీయూల్సి వస్తోంది. ఈ ఏడాది 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లా పరిషత్‌కు నిధులు మంజూరవకపోవడంతో ప్రాజెక్టు నిర్వహణ పడకేసింది. ఏటా రూ.1.50 కోట్లు ఢీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిరంతరాయంగా పనిచేసి, ప్రజల దాహార్తిని తీరుస్తుంది.
మూడేళ్లుగా మూలనపడ్డ ఫిల్టర్ బెడ్లు
రెండు రోజులకోసారి నీళ్లు సరఫరా అవుతుండటంతో నర్సంపేటవాసులు నానా అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని ద్వారకాపేట ఫిల్టర్‌బెడ్ నుంచి పాఖాల వాగుకు చెందిన నీటిని ఫిల్టర్ చేయుకుండా నేరుగా సరఫరా చేస్తున్నారు. దీంతో అవి తాగేందుకు వినియోగించేలా లేవు. స్థానికంగా ఉన్న 20 వార్డుల్లో 36,241 జనాభా ఉండగా, ఆ మేరకు నీటి సరఫరా లేదు. నీటిని శుద్ధి చేసే 4 ఫిల్టర్ బెడ్లు ఉన్నా.. గత మూడేళ్లుగా అవి నిరుపయోగంగా మిగిలిపోయూరుు. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చొరవ చూపినవారే లేకపోవడం గమనార్హం. దీనిపై ప్రజలు నిలదీయూల్సిన అవసరముంది. ప్రభుత్వం రూ.50 లక్షలు వెచ్చిస్తే ఫిల్టర్‌బెడ్ ఉపయోగంలోకి వచ్చే అవకాశాలు ఉంటారుు.
అడుగంటిన భూగర్భ జలాలు
వర్షాభావ పరిస్థితులు, వేసవి తీవ్రత వెరసి నర్సంపేట డివిజన్లోని జ లాశయూల్లో నీటిమట్టాలు అడుగంటుతున్నారుు. ఇంకా ఏప్రిల్ రాకముందే ఇటువంటి పరిస్థితి ఉంటే.. మే నాటికి ఎలా ఉంటుందోనని ప్రజానీకం కలవరపడుతున్నారు. ఈవిషయూన్ని ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయునీయుంగా ఉంది. నర్సంపేట నియోజకవర్గంలో గతేడాది(2015) ఫిబ్రవరిలో 7.34 ఎంహెచ్జీఎల్ సరాసరి భూగర్భజల మట్టం ఉండగా.. అది కాస్తా 2015 మే నాటికి 7.72 ఎంహెచ్‌జీఎల్‌కు పెరిగింది. ఆ తర్వాతి నుంచి వర్షాభావ పరిస్థితులు చుట్టుముట్టడంతో ఈ ఏడాది జనవరి నాటికి నియోజకవర్గంలో సరాసరి నీటిమట్టం 6.53 ఎంహెచ్‌జీఎల్‌కు పడిపోవడం గమనార్హం.
రూ.2 కోట్లతో సమస్య తీరుతుందిలా..
నియోజకవర్గ ప్రజల నీటి కష్టాలు తీరాలంటే రూ.2 కోట్లను ప్రభుత్వం వెచ్చించాలి. అశోక్‌నగర్‌లోని ఢీఫ్లోరైడ్ ప్రాజెక్ట్ నిర్వహణకు రూ.1.50 కోట్లు, ద్వారకాపేట సమీపంలోని 4 ఫిల్టర్బెడ్లను వినియోగంలోకి తెచ్చేందుకు రూ.50 లక్షలను మంజూరు చేయూలి. ఆ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు ఐకమత్యంతో అధికారులపై ఒత్తిడి పెంచాల్సిన అవసరముంది. ఖానాపురం వుండల కేంద్రంలోని ఫిల్టర్‌బెడ్‌ను కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటారుుంచాల్సిన అవసరం ఉంది.
వాటర్ క్యాన్ రూ.15
గత్యంతరం లేక ప్రజలు వాటర్ క్యాన్లు కొని దాహార్తిని తీర్చుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలోని 165 నీటిప్లాంట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. గతంలో 25 లీటర్ల నీటి క్యాన్ రూ.5 నుంచి రూ.8 ధర పలికేది. నీటిఎద్దడి నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకొని వ్యాపారులు క్యాన్ ధరను అమాంతం రూ.15కు పెంచేశారు. నిబంధనలను తుంగలో తొక్కి నీళ్ల బేరం చేస్తున్న పలు నీటిప్లాంట్లను అధికారులు తనిఖీ చేసిన దాఖలాలూ పెద్దగా లేవు. దీంతో వాళ్లు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు.
నిధులు అందితేనే ‘ప్రాజెక్ట్’ నిర్వహణ
నర్సంపేట నియోజకవర్గంలోని 132 గ్రావూలకు తాగునీరు అందించేందుకు అశోక్‌నగర్‌లోని ఢీ ఫ్లోరైడ్ ప్రాజెక్టులో నీళ్లు సరిపోనూ ఉన్నారుు. కానీ ఈ ఏడాది ప్రాజెక్టుకు జిల్లా పరిషత్ నుంచి నిధులు అందలేదు. దీంతో దాని నిర్వహణ పడకేసింది. ఫలితంగా దీనిలో పనిచేసే 31 వుంది ఆపరేటర్లకు గత 9 నెలలుగా జీతాలు అందలేదు. రూ.1.50 కోట్లు కేటారుుస్తే ప్రాజెక్ట్ నిర్వహణ కొనసాగుతుంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. - వెంకట్రాం రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, నర్సంపేట