పగే ఊపిరైతే...! | Director Sudarshan Reddy said that the film would release the film in September. | Sakshi
Sakshi News home page

పగే ఊపిరైతే...!

Published Sun, May 28 2017 12:51 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

పగే ఊపిరైతే...!

పగే ఊపిరైతే...!

ఆశ, శ్వాసే కాదు.. పగ కూడా కొందర్ని బతికేలా చేస్తుంది. అందుకు శత్రువు పై ప్రతీకారం తీర్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉంటే చాలు. ఆ పగే ఊపిరై బతికిస్తుందనే కథతో  రూపొందుతోన్న రివెంజ్‌ థ్రిల్లర్‌ ‘శత్రు’. సుదర్శన్‌రెడ్డి దర్శకత్వంలో హరినాథ్‌రెడ్డి, తపస్, తమన్నా వ్యాస్, శ్రేయా వ్యాస్‌ ముఖ్య తారలుగా టి.హరినాథ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి బేబీ కుసుమ క్లాప్‌ ఇవ్వగా, శ్రీమతి స్వప్న కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి, సెప్టెంబర్‌లో మూవీని రిలీజ్‌ చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు సుదర్శన్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement