
సాక్షి, న్యూఢిల్లీ: యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను కొనసాగిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఐదు గంటలపాటు నేషనల్ హెరాల్డ్ కేసులో సుదర్శన్‌రెడ్డి విచారణ సాగింది.
కాగా ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సెప్టెంబర్ 23 న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పార్టీ నేత గాలి అనిల్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. పీఎంఎల్‌ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం ఇప్పటికే ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఈనెల 6న మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్‌లను ఈడీ అధికారులు విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment