నిజాంసాగర్, న్యూస్‌లై న్: నిజాం పాలనలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు వ ంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం.. నాటి చీఫ్ ఇంజి నీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కృషి ఫలితమేనని భారీ నీటిపారుదల మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. సోమవారం ఆయన ప్రాజెక్టు గుల్‌దస్తా వద్ద బహదూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటికి అధిక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా ప్రధాన కాలువ లైనింగ్ పనులు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్న ఈ ప్రాజెక్టుతోపాటు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాం తంలో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించిన బహదూర్ విగ్రహ ఏర్పాటుకు తాను కృషి చేయగా, ఇంజినీర్ కుటుంబ సభ్యులు సానుకూలం గా స్పందించారని పేర్కొన్నారు. గుల్‌దస్తా వద్ద గార్డెన్‌ను అభివృద్ధి చేస్తే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గార్డెన్‌గా నామకరణం చేస్తామన్నారు. అం దుకు కృషిచేయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అదిత్యానాథ్‌దాస్‌కు సూచించారు. అతిథి గృహంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చే యాల న్నారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, గేట్ల పెయిం టింగ్ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పను లు పూర్తిచేయాలన్నారు.
జిల్లాలో రూ. 4 వేల కోట్ల పంటలు పండుతున్నాయి
జిల్లాలోని ఖరీఫ్, రబీ సీజన్లలో రూ. 4 వేల కోట్ల విలువగల పంటలను రైతులు పండిస్తున్నారని మం త్రి అన్నారు. సింగూరు జలాశయం ద్వారా వాటా ప్రకారంగా నిజాం సాగర్ కు నీటిని తెస్తామన్నారు. పోచారం ప్రాజెక్టు వల్ల నిజాంసాగర్ నిండిందన్నా రు. దిగువన ఉన్న సింగితం రిజర్వాయర్, కళ్యాణి ప్రాజెక్టుల వల్ల నిజాంసాగర్ ఆయకట్టు పంటలకు ఖరీఫ్‌లో సాగునీరందిందన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జిల్లా ప్రజానీకానికే కుటుం బ పెద్దలా నిలిచిపోయారన్నారు.
వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం లో ఉన్నఇందూరుకు సాగునీటి కేటాయింపులో సీమాంధ్ర పాలకులు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. మెదక్ జిల్లాలో నిర్మించిన సింగూరు ప్రాజెక్టుతో నిజాంసాగర్‌కు నీళ్లురాని పరిస్థితులు దాపురించాయన్నారు. నాగార్జునసాగర్ జలాలను హైద రాబాద్‌కు తరలించి, సింగూరు జలాలను పూర్తిగా నిజాం సాగర్‌కు కేటాయించాలని కోరారు. సింగూ రు నీటి కోసం జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డితో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన
కాలువ ఆధునికీకరణ పనులు పటిష్టంగా జరిగితే చివరి ఆయకట్టుకు మేలు జరుగుతుందన్నారు.
హర్షణీయం
జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ 1923-31 సంవ త్సరాల కాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టును కట్టిన అప్పటి చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహాన్ని అవిష్కరించడం హర్షణీయమన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ హన్మంత్ సింధే తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, నాయకులు ఆకుల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ పట్వారి గంగాధర్, మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, సర్పంచులు మణేమ్మ, రాజు తదిరతరులు పాల్గొన్నారు. బహదూర్ మనుమళ్లు, మనుమరాళ్లు మీర్ అహ్మద్ అలీ,అక్మర్ అలీ,అఫీజ్ అ లీ, ఉన్నత్ ఉన్నీ సా బేగం హాజరయ్యారు. అం త కు ముందు బహదూర్ విగ్రహావిష్కరణ ఆడంబరంగా జరిగింది.
నవాబ్ కృషి ఫలితమే నిజాంసాగర్
Published Tue, Jan 14 2014 6:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement