nizam ruling
-
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. అద్దె ఇంట్లో మరణించాడు
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన హైదరాబాద్ సంస్థానం 8వ నిజాం రాజు టర్కీలో అద్దె ఇంట్లో మరణించాడు. ఇస్తాంబుల్ నగరంలోని ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో జనవరి 14న మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజా బహదూర్ (89) కన్నుమూసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 1967లో కుబేరుడిగా ఉన్న ఆయన తన చివరి రోజుల్లో ఓ సామాన్యుడిలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 1971లో భారత ప్రభుత్వ రాజాభరణాలు రద్దు చేసేంత వరకు ‘ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్’గా ఉన్నారు. అత్యంత విలాసాలు, నలుగురు భార్యలు, పిల్లలో ఆస్తి వివాదాలతో ముకరంజా దివాళా తీశారు. ఆస్తులు అమ్మకుండా కోర్టు ఆంక్షలు విధించడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి. 30 ఏళ్ల వయసులోనే 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు వారసుడైన ముకరంజా ఆ తర్వాత నిర్లక్ష్యం కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. కాగా ముకరంజా భౌతికకాయం మంగళవారం హైదరాబాద్ చేరుకుంటుందని నిజాంట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. తన అంతిమ సంస్కారాలను హైదరాబాద్ మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల వద్ద నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనుమడే ముకరంజా. 1933 అక్టోబర్ 6న ఫ్రాన్స్‌లో ఆయన జన్మించారు. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య, లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1967లో 8వ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం 1967లో ఎనిమిదవ నిజాంగా.. భారత యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్ 6, 1967లో ఎనిమిదవ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. కాగా, మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న నిర్వహించే ముకరంజా అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సోమవారం పరిశీలించారు. ముందుగా చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించిన అధికారుల బృందం సభ్యులు అక్కడ ఏర్పాట్లు పరిశీలించింది. ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో.. మంగళవారం ముకరంజా భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకు వచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించనున్నారు. 18న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చౌమహాల్లా ప్యాలెస్‌లో ఆయన పార్థివదేహాన్ని సందర్శించడానికి ప్రజలను అనుమతించనున్నారు. తర్వాత అంత్యక్రియలకోసం పార్థీవ దేహాన్ని తరలిస్తారు. -
నిజాం పాలనలో జీవిస్తునే దేశ స్వాతంత్ర్యంకోసం పోరాటం
-
‘అణా’దిగా చెలా‘మనీ’
మనీ.. మనిషి జీవితాన్నే శాసిస్తోంది. అణా నుంచి నేటి రెండు వేల రూపాయల నోటు దాకా కరెన్సీకి ఎంతో చరిత్ర ఉంది. హైదరాబాద్ సంస్థానంలో కరెన్సీ ఎప్పుడు ప్రారంభమైంది? ఏ పాలకుడి హయాంలో ఎన్ని రకాల నాణేలు, నోట్ల తయారీ జరిగింది? ఆయా కాలాల్లో మనీ.. చెలామణి ఎలా ఉండేది? అనే ప్రశ్నలు ఎప్పుడూ ఆసక్తి కలిగించేవే. నిజాం హయాంలో పేపర్ కరెన్సీ మొదలుపెట్టి వందేళ్లు అవుతున్న సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం. హైదరాబాద్ సంస్థానం సొంత నాణేల ముద్రణ 1857లో మొగల్ రాజ్య పతనానంతరం ఐదో నిజాం అఫ్జలుద్దౌల్లా మొగల్ నాణేల వాడకాన్ని నిలిపి వేసి సొంతంగా సుల్తాన్ షాహీ ప్రాంతంలో నాణేల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు. ఈ నాణేలను ‘హలి సిక్కా’గా పిలిచేవారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ హయాంలో 1895లో యంత్రం ద్వారా తొలిసారి నాణేలను తయారు చేయడం ప్రారంభించారు. దీన్ని చర్ఖీ సిక్కా (చర్ఖీ(చక్రం) ద్వారా తయారు చేసిన నాణేలు) అని పిలిచేవారు. ఒకటో ప్రపంచ యుద్ధకాలం నాటికి వెండి ధర గణనీయంగా పెరిగింది. ఫలితంగా నాణేల ముద్రణ భారం కావడంతో ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఓ ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేసి పేపర్ కరెన్సీ ముద్రణపై నివేదిక ఇవ్వాలని ఆదేశించాడు. కమిటీ సిఫారసుల మేరకు హైదరాబాద్ సంస్థానంలో 1918 ఏప్రిల్ 24వ తేదీన తొలిసారిగా పేపర్ కరెన్సీ విడుదల చేశారు. 1959 వరకే ఉస్మానియా కరెన్సీని ముద్రించారు. ఈ కరెన్సీపై ప్రభుత్వ ఖజానా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సంతకముండేది. హైదరాబాద్ కరెన్సీ చట్టం కింద జారీ చేసిన నోట్లను ఉస్మానియా కరెన్సీ అని పిలిచేవారు. 1918లో ఒక రూపాయి, ఐదు రూపాయల నోట్లు విడుదల చేశారు. 1926లో వెయ్యి రూపాయి నోట్లు జారీ చేశారు. 1959 వరకు హైదరాబాద్ స్టేట్ కరెన్సీ కొనసాగింది. హైదరాబాద్ సంస్థాన విలీనంతో భారత కరెన్సీ అమలులోకి వచ్చింది. 500 ఏళ్లకు పూర్వం .. గోల్కొండ సంస్థానంలో హున్ నాణేలు గోల్కొండ సంస్థానంలో బహమనీల పాలనా కాలంలో హున్ నాణేల వాడకం ఉండేది. వీరి పతనానంతరం కుతుబ్ షాహీ పాలన నుంచే సొంతంగా నాణేల తయారీ మొదలైంది. 1689లో తానీషా పాలన వరకు కుతుబ్ షాహీ నాణేల వాడకముంది. గోల్కొండను మొగల్ చక్రవర్తి ఔరంగజేబు స్వాధీనం చేసుకోవడంతో కుతుబ్‌షాహీ నాణేల వాడకం అంతరించి మొగల్ నాణేలు వాడుకలోకి వచ్చాయి. బంగారు, వెండి నాణేలు ఐదో నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో సొంతంగా నాణేల తయారీ ఉండేది. వాటిని బంగారం, వెండి, రాగి, ఇత్తడితో తయారు చేసేవారు. 1905 నుంచి 1945 వరకు నాలుగు రకాలుగా బంగారు నాణేలు తయారు చేసి వినియోగించేవారు. ఇందులో 11.09 గ్రాముల బంగారు నాణేం చాలా గుర్తింపు పొందింది. నాణేలు, పేపర్ కరెన్సీ ఇలా... నాణేనికి ఒకవైపు నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహీ బహదూర్ ఉంటే మరోవైపు ఫరకందా బునియాద్ హైదరాబాద్ అని ఉర్దూ అక్షరాల్లో ఉండేవి. ఇవి నాణేంపైన బయటికి వచ్చినట్లుగా ఉండేవి. ఇక వెండి, బంగారు నాణేలపై ఒకవైపు చార్మినార్, మరోవైపు అసఫ్ జాహీల ఫరకందా బునియాద్ ఉండేది. పేపర్ కరెన్సీపై ఉస్మానియా సిక్కా అని ఉర్దూతోపాటు తెలుగు, హిందీ, ఆంగ్లం, కన్నడ, మరాఠీ భాషల్లో విలువ రాసి ఉండేది. భారత దేశ కరెన్సీతో కలిపిన నిజాం కరెన్సీ 1950లో భారత రూపాయిని స్థానిక ద్రవ్యంతో పరిచయం చేశారు, 7 హైదరాబాద్ రూపాయలు = 6 భారతీయ రూపాయలుగా వినియోగించేవారు. 1951లో హైదరాబాద్ రూపాయి వాడకాన్ని నిలిపివేశారు. దీంతో భారత రూపాయి ప్రధాన ద్రవ్య కరెన్సీగా మారింది, అయితే, హైదరాబాద్ రూపాయి 1959 వరకు చెల్లింది. -
ఇది విమోచన దినమే!
అభిప్రాయం విమోచనం అయితేనేం..? విలీనం అయితేనేం? నిజాం నిరంకుశత్వం నుంచి తెలంగానం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు, ప్రజలు కోరుకున్న స్వాతంత్య్రం సిద్ధించిన రోజు సంబురం కాకుండా ఎలా ఉంటుంది? పాలకుడనేవాడు చరిత్రను గౌరవించాలి. కాలానుగు ణంగా జరిగిన మార్పులు చరిత్రను మసకబార్చలేవు. ఆధునిక కాలంలో జరిగిన ఉద్యమాలు పూర్వ ఉద్య మాలు రగిలించిన స్ఫూర్తిని తుడిచిపెట్టలేవు. చరిత్రను పునర్ లిఖించుకోవడం అంటే, గత చరిత్రను రూపు మాపుకోవడం కాదు. వక్రీకరించడమూ కాదు. చరిత్ర ఏదైనా దానిని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నవారు ఉంటారు. ముందే ఏర్పరుచుకున్న లేదా సొంత అభిప్రా యాలతో గతాన్ని సరిపోల్చుకుని చూసుకుంటూ, నిజ మైన చరిత్ర ఇది కాదని వాదించేవారు ఉన్నారు. ఇక కలం-బలం తోడు ఉన్న వాళ్లు కొందరు చరిత్రని మార్చే ప్రయత్నం చేశారు కూడా. ఈ చరిత్ర మాది, మేం లేకపోతే చరిత్ర లేదు, మాతోనే చరిత్ర మొదలయింది, లేకుంటే అది చరిత్ర కాదు, అలాంటి చరిత్ర ఉండ రాదంటూ వాదించినవారూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వాతావరణమే ఇవాళ తెలం గాణలో ప్రతిబింబిస్తున్నది. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినమా? విలీనమైన రోజా? లేక విద్రోహమా? మొదట ఇది తేలాలని అంటున్నారు. కొందరి మనోభావాలను గాయపరచడం ఇష్టం లేక, ఆ కారణంగానే సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేకపోతున్నదని నిర్మొహమా టంగా ప్రకటిస్తూ యావత్ తెలంగాణను విస్మయ పరుస్తున్నారు. పోరాటంతో వచ్చిన నవ తెలంగాణ, నయా నిజాం తీరును చూసి విస్తుపోతున్నది. తెలం గాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని గతంలో గళమెత్తిన గొంతులే ఇప్పుడు గాడి తప్పడం గమనించి ప్రజల గొంతులే గద్గదమవుతున్నాయి. నవ్వి పోదురు గాక నాకేటి వెరపు అన్న చందంగా పాలకులు మాట మారుస్తున్నారు. ఈ వ్యవహారం నిజంగా సామాన్య ప్రజలను వ్యాకుల పరుస్తున్నది. తెలంగాణ అంటే దగాకోరుల వారసత్వమా లేక దగా పడే ప్రజలకు బానిసత్వమా అని మువ్వన్నెల జెండా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు. జాతీయవాదుల అండతో తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నారు. కానీ వినేవారు ఎవరు? చెవిటివాని ముందు శంఖం ఊదటం వ్యర్థమన్నది పాత సామెత. పాలకులకు చెబితే ఎంత! చెప్పకపోతే ఎంత! రెండింటికీ పెద్ద తేడా లేదు అనేది నేటి నానుడి. ఎందుకంటే మన తెలంగాణలో తెలంగాణ పాలకులు ప్రజల గొంతుకలను గౌరవించటం మానుకొని చాలా కాలమయింది కనుక. అసలు విమోచనం అయితేనేం..? విలీనం అయి తేనేం? వివాదమెందుకు? నిజాం నిరంకుశ దాస్య శృంఖలాల నుంచి తెలంగానం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు, ప్రజలు కోరుకున్న స్వాతంత్య్రం సిద్ధించిన రోజు సంబురం కాకుండా ఎలా ఉంటుంది? ఉత్సవం కాకుండా ఎలా ఉంటుంది? నిశీధి విడిచిన జామును ఉదయ కిరణాలు స్పృశించాక ఎలా ఉంటాయి? అంధకార బంధురమైన జీవితానికి వెలుగొచ్చినపుడు వసంతం కాదని ఎలా అంటాం? పాలకులకు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ‘సెప్టెంబర్ 17’ అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిం చాలన్న డిమాండ్‌ను ఏదో రకంగా అల్పమయిన విష యంగా పక్కదోవ పట్టించే వారికొక మనవి. ఆత్మ వంచన వీడండి! బానిస మనస్తత్వాలను సంస్కరించు కోండి! ఓట్ల రాజకీయమే పరమావధి కాదని గుర్తించండి! పురాణాల్లోని నరకాసుర వధను పండుగగా జరు పుకుంటున్న మనం, మన తెలంగాణ పూర్వీకుల జీవి తాలను దుర్భరంగా చేసినవారి, అదే విధంగా వేలా దిమంది ప్రజల ప్రాణాలను బలిగొన్న రజాకారా సురుల పాలనాంతాన్ని ఉత్సవంగా ఎందుకు జరుపు కోలేం? అధికారికంగా జరపొద్దనే కొందరి వాదన ఓట్లకోసం చేసుకుంటున్న ఆత్మవంచనే తప్ప మరోటి కాదు. వితండవాదానికి పరాకాష్ట తప్ప మరోటి కాదు. బ్రిటిష్ పాలకుల రాచరికపు, నిరంకుశ పాలన నుంచి భారతావనికి వచ్చినది స్వాతంత్య్రమయినప్పుడు, నిజాం రాచరికపు పాలన నుంచి విముక్తులైన తెలం గాణ ప్రజలకు వచ్చినది స్వాతంత్య్రం కాదా? విమో చనం కాదా? ఆత్మ బలిదానాల, ఆత్మాభిమానాల త్యాగ ధనం విమోచనమా? విలీనమా? విద్రోహమా? తేల్చు కోవాల్సిన తరుణమిది. ‘విద్రోహం’ అనేది - నాటి తెలంగాణ స్వాతంత్య్ర వీరుల త్యాగాలను అవమానపరుస్తుంది. ‘విలీనం’ అనేది - నిజాం నిరంకుశ చరిత్రను సమర్థించినట్లవుతుంది. ‘విమోచనం’ అనేది మాత్రమే - ఆనాటి త్యాగ ధనుల స్ఫూర్తిని నిలబెడుతుంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలందరూ ఏకమై అనేకమై ఒక్క గొంతుకతో నినదించాలి. సెప్టెంబర్ 1న మువ్వన్నెల జెండా చేత పూని తిరంగా స్ఫూర్తిని చాటాలి. స్వాతంత్య్ర స్వేచ్ఛావాయువులను నలుదిశలా వీచేలా చేయాలి. నిజానికి ఈ మహత్కార్యానికి ప్రభుత్వం కూడా సహకరించాలి. అధికారికంగా వేడు కలను నిర్వహించాలి. లేకుంటే అదే అసలైన విద్రోహం. అప్పుడు ప్రజలు మరో విమోచన కోసం ఉద్యమిస్తారు. ఇది నిజం. ఇది తథ్యం. (తెలంగాణ విమోచన దినం సందర్భంగా) ఆర్. శ్రీధర్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొబైల్: 99855 75757 -
నవాబ్ కృషి ఫలితమే నిజాంసాగర్
నిజాంసాగర్, న్యూస్‌లై న్: నిజాం పాలనలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు వ ంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం.. నాటి చీఫ్ ఇంజి నీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కృషి ఫలితమేనని భారీ నీటిపారుదల మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. సోమవారం ఆయన ప్రాజెక్టు గుల్దస్తా వద్ద బహదూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటికి అధిక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా ప్రధాన కాలువ లైనింగ్ పనులు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్న ఈ ప్రాజెక్టుతోపాటు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాం తంలో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించిన బహదూర్ విగ్రహ ఏర్పాటుకు తాను కృషి చేయగా, ఇంజినీర్ కుటుంబ సభ్యులు సానుకూలం గా స్పందించారని పేర్కొన్నారు. గుల్దస్తా వద్ద గార్డెన్‌ను అభివృద్ధి చేస్తే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గార్డెన్‌గా నామకరణం చేస్తామన్నారు. అం దుకు కృషిచేయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అదిత్యానాథ్దాస్కు సూచించారు. అతిథి గృహంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చే యాల న్నారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, గేట్ల పెయిం టింగ్ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పను లు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో రూ. 4 వేల కోట్ల పంటలు పండుతున్నాయి జిల్లాలోని ఖరీఫ్, రబీ సీజన్లలో రూ. 4 వేల కోట్ల విలువగల పంటలను రైతులు పండిస్తున్నారని మం త్రి అన్నారు. సింగూరు జలాశయం ద్వారా వాటా ప్రకారంగా నిజాం సాగర్ కు నీటిని తెస్తామన్నారు. పోచారం ప్రాజెక్టు వల్ల నిజాంసాగర్ నిండిందన్నా రు. దిగువన ఉన్న సింగితం రిజర్వాయర్, కళ్యాణి ప్రాజెక్టుల వల్ల నిజాంసాగర్ ఆయకట్టు పంటలకు ఖరీఫ్‌లో సాగునీరందిందన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జిల్లా ప్రజానీకానికే కుటుం బ పెద్దలా నిలిచిపోయారన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం లో ఉన్నఇందూరుకు సాగునీటి కేటాయింపులో సీమాంధ్ర పాలకులు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. మెదక్ జిల్లాలో నిర్మించిన సింగూరు ప్రాజెక్టుతో నిజాంసాగర్‌కు నీళ్లురాని పరిస్థితులు దాపురించాయన్నారు. నాగార్జునసాగర్ జలాలను హైద రాబాద్‌కు తరలించి, సింగూరు జలాలను పూర్తిగా నిజాం సాగర్‌కు కేటాయించాలని కోరారు. సింగూ రు నీటి కోసం జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డితో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు పటిష్టంగా జరిగితే చివరి ఆయకట్టుకు మేలు జరుగుతుందన్నారు. హర్షణీయం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ 1923-31 సంవ త్సరాల కాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టును కట్టిన అప్పటి చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహాన్ని అవిష్కరించడం హర్షణీయమన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ హన్మంత్ సింధే తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, నాయకులు ఆకుల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ పట్వారి గంగాధర్, మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, సర్పంచులు మణేమ్మ, రాజు తదిరతరులు పాల్గొన్నారు. బహదూర్ మనుమళ్లు, మనుమరాళ్లు మీర్ అహ్మద్ అలీ,అక్మర్ అలీ,అఫీజ్ అ లీ, ఉన్నత్ ఉన్నీ సా బేగం హాజరయ్యారు. అం త కు ముందు బహదూర్ విగ్రహావిష్కరణ ఆడంబరంగా జరిగింది. -
అలుపెరగని యోధుడు కిషన్
తెలంగాణ సాయుధపోరాటంలో ఆయనో అగ్నికణం, రజాకర్లకు ఎదురొడ్డి పోరాడిన వీరుడు. జాగీరుదారుల, పెత్తందారుల కోరలు పీకిన సింహస్వప్నం, వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. భూస్వాములను గడగడలాడించి పేదప్రజలకు భూములు పంచి వారి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకుడు. ఆయన పోరాట పటిమ మింగుడుపడని కొందరు భూస్వాములు, పెత్తందార్లు రోడ్డు ప్రమాదంలో ముసుగులో చంపి నేటికి 53 యేళ్లు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం... మెదక్ రూరల్, న్యూస్‌లైన్: చిన్నశంకరంపేట మండలం తుర్కల మాందాపూర్‌కు చెందిన కేవల్ నారాయణ, మున్నాబాయిల మూడో సంతానంగా 1920లో కేవల్ కిషన్ జన్మించా రు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1941లో డీగ్రీ పట్టా పొందారు. చిన్ననాటి నుంచే విప్లవభావాలు కలిగి ఉన్నారు. అయితే తెలంగాణలో హైద్రాబాద్ సం స్థానాధిపతి నిజాం నవాబుల పాలన కొనసాగుతోం ది. భూస్వామి, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్ పట్వారీల నిరంకుశ, దోపిడీ విధానాలు చోటుచేసుకుంటున్న రోజులు. దీంతో నిజాం ప్రభుత్వానికి వ్యతి రేకంగా తెలంగాణ రైతాంగ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం సాయుధపోరాటం ప్రారంభమైంది. అందులో మెతుకుసీమ పోరుబిడ్డ కేవల్ కిష న్ తానుసైతం అంటూ నిజాం పాలనకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశాడు. దోపిడీదారుల, పెత్తందార్ల గుండెల్లో బల్లెంలా నిలిచాడు. నిజాంపాలన విమోచనం వరకు పోరాటం సాగించాడు. అనంతరం దున్నేవాడిదే భూమి అంటూ భూస్వాముల మిగులు భూముల్లో జెండాలు ప్రజలతో పాతించారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో మెదక్ జిల్లాలోని జోగిపేటలో ఆంధ్రమహాసభ ఏర్పాటుచేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. పెత్తందారులపై తిరుగుబాటు బావుట ఎగురవేయడంతో ఆయనకు ఎనలేని గుర్తింపు లభించింది. అప్పట్లో మెదక్ మున్సిప్ మెజిస్ట్రేట్ ద్వారా తహశీల్దార్ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం నుండి పిలుపు కూడా వచ్చింది. కానీ దానిని ప్రజల కోసం త్యజించారు. మెదక్ డివిజన్లో ని కాట్రియాల, పాతూర్, అక్కన్నపేట, జక్కన్నపేట, మాసాయిపేట గ్రామాల్లో నిరుపేదలకు వేల ఎకరాల భూములు ఇప్పించి పేదల నాయకుడు అయ్యారు. ఊరూర కమిటీలు వేసి సీపీఐని గడపగడపకు తీసుకెళ్లారు. మెదక్ మండల పరిధిలోని జక్కన్నపేట గ్రామశివారులోగల బ్రాహ్మణ చెరువు ఆయకట్టు భూముల ఆక్రమణను అడ్డుకునే క్రమంలో పోలీసులు తుపాకులు ఎక్కు పెట్టినా బెదరని ధీరుడు. ఆ భూములను పెదలకు అందించడంతో ఆ గ్రామంలో కేవల్ కిషన్ విగ్రహం ఏర్పాటు చేసి ప్రతియేటా ఉత్సవాలను నిర్వహిస్తారు. 1951-52లో జరిగిన ప్రథమ సాధారణ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రసీ పార్టీ(పీడీఎఫ్)తరఫున మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి కేవలం 200 ఓట్ల తేడాతో ఓటమిచవి చూశారు. 1960 డిశంబర్ 26న వెల్దూర్తి మండలం మాసాయిపేటకు ఆయన సన్నిహితుడు లక్ష్మయ్యతో బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా చేగుం ట మండలం పొలంపల్లి గేటు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో కిషన్, అతని సన్నిహితు డు మృతిచెందారు. అయితే ఆయన ఉద్యమ స్ఫూర్తిని నచ్చని కొందరు హత్య చేయించి, దీనిని రోడ్డు ప్రమాద మృతిగా చిత్రీకరించారన్నది కిషన్ అభిమానుల ఆరోపణ. ప్రమాదం జరిగినచోటే కామ్రెడ్ కేవల్ కిషన్, ఆయన సన్నిహితుడు లక్ష్మయ్య విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతియేటా డిశంబర్ 26న ప్రజలు ఎడ్లబండ్లు ఊరేగించి ఉత్సవాలు నిర్వహిస్తునానరు. ఆయనపై ఉన్న అభిమానంతో చాలా గ్రామాల్లో పిల్లలకు పేర్లు పెట్టుకున్నారు. ఊరూరా విగ్రమాలను ఏర్పాటుచేశారు. నేటికి ఆయనపై బుర్రకథలు, ఒగ్గుకథలు పల్లెల్లో చె బుతారు. అయితే ఆయన భౌతికంగా లేకున్నా తమ గుండెల్లో గూడు కట్టుకున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. ఆయన మరణించాక కేవల్ కిషన్ భార్య ఆనందాదేవి 1964లో మెదక్ నియోజకవర్గం నుండి పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అనంతరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు