సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో మోదీ చేసిన అభివృద్ది చెప్పడం కంటే.. రాహుల్ గాంధీ ఫ్యామిలీపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీల గూర్చి ప్రస్తావించడం లేదని పేర్కొన్నారు. యూపీఏకు టీఆర్‌ఎస్ మద్దతు అవసరమైతే అధిష్టానం చూసుకుంటుందన్నారు.
అంబర్‌పేట్‌లో జరిగిన ఘర్షణలపై మాట్లాడుతూ.. మజీద్ స్థలం పురాతనమైనదని అన్నారు. జీహెచ్‌ఎంసీ అక్రమంగా కూల్చివేసిందని తెలిపారు. పురాతన మజీద్‌కు కనీసం గౌరవం ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనికి కారణమైన అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపరిహారం ఎవరికి చెల్లించారని నిలదీశారు. ఏ ప్రాతిపదికగా చెల్లించారని, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న మజీద్‌కు ఇతరులకు ఎలా పరిహారం చెల్లిస్తారని ప్రశ్నించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment