అజరుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవితం ఆధారంగాత్వరలోనే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ ఆ చిత్రంలో అజరుద్దీన్ పాత్ర పోషించనున్నాడు. అజర్‌ది చాలా ఉద్విగ్నభరితమైన జీవితమని, రెండున్నర గంటల సినిమాలో అతని జీవితాన్ని ప్రతిబింబించడం చాలా కష్టమని హష్మీ అంటున్నాడు. ఈ చిత్రం క్రికెట్ కంటే ఎక్కువగా జీవితాన్ని ప్రతిబింబించేదిగానే ఉంటుందని చెబుతున్నాడు.