Emran Hashmi
-
పని మొదలెట్టాడు!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బయోగ్రఫికల్ మూవీ కోసం హీరో ఇమ్రాన్ హష్మీ అప్పుడే పని మొదలు పెట్టేశాడు. ఆటలో అజహర్లా వెండి తెరపై జీవించాలని తపన పడుతున్నాడు. అందులో భాగంగా ఈ ‘ముద్దుల’ హీరో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సిడ్నీ వెళ్లాడట. మోహిత్ సూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హమారీ అధూరీ కహానీ’ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నేరుగా సిడ్నీ ఫ్లయిట్ పట్టుకున్నాడట ఇమ్రాన్. టీవీలో కంటే ప్రత్యక్షంగా చూస్తేనే ఒరిజినాలిటీ అర్థమవుతుందనేది మనోడి అభిప్రాయమట. ఈ సినిమాలో అజహర్ మొదటి భార్య నౌరీన్గా ప్రచీదేశాయ్, సంగీతా బిజిలానీగా కరీనాకపూర్ చేస్తున్నారని సమాచారం. -
అజరుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవితం ఆధారంగాత్వరలోనే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ ఆ చిత్రంలో అజరుద్దీన్ పాత్ర పోషించనున్నాడు. అజర్ది చాలా ఉద్విగ్నభరితమైన జీవితమని, రెండున్నర గంటల సినిమాలో అతని జీవితాన్ని ప్రతిబింబించడం చాలా కష్టమని హష్మీ అంటున్నాడు. ఈ చిత్రం క్రికెట్ కంటే ఎక్కువగా జీవితాన్ని ప్రతిబింబించేదిగానే ఉంటుందని చెబుతున్నాడు. -
ఇమ్రాన్ హష్మికి పాకిస్థాన్‌లో అభిమానులు
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మికి పాకిస్థాన్‌లో ఎంతోమంది అభిమానులు ఉన్నారని పాకిస్థాన్ నటి, మోడల్ హ్యుమైమా మాలిక్ పేర్కొంది. ఇమ్రాన్‌తో కలిసి హ్యుమైమా ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో నటిస్తోంది. ‘వాస్తవానికి ఇమ్రాన్‌ను పాకిస్థానీయుడని తమ దేశ ప్రజలు అనుకుంటారు. ఇమ్రాన్ సినిమా విడుదలైతే మా దేశంలో ఓపెనింగ్స్ బాగుంటాయి’ అని అంది. ప్రేక్షకులు ఇమ్రాన్‌ను ఎంతో ఇష్టపడతారని, ఎక్కువమంది అతనిని పాకిస్థానీ జాతీయుడిగానే భావిస్తార ని తెలిపింది. అందువల్ల తాను నటిస్తున్న ‘రాజా నట్వర్లాల్’ సినిమాకు తమ దేశంలో మంచి ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఎటువంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమేనని ‘బోల్’ సినిమాలో తన నటనా శైలితో విమర్శకులనుంచి ప్రశంసలందుకున్న హ్యుమైమా పేర్కొంది. ఒక నటిగా సినిమాలకు సంబంధించినంతవరకూ తనపై తాను ఎటువంటి పరిమితులను విధించుకోదలుచుకోలేదని చెప్పింది. అయితే అర్ధవంతమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడతానంది. అందులోనూ తన పాత్ర సినిమాలో కచ్చితంగా కీలకమైనదిగా ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపింది. ఇమ్రాన్ రొమాన్స్ సీన్లను పండిస్తాడని అభిప్రాయపడింది. ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో సైతం అనేక రొమాన్స్ సీన్లను పండించాడంది. ‘అతనో కూల్ పర్సన్. చక్కని సహనటుడు అని ఈ 28 ఏళ్ల మోడల్ తన మనసులో మాట చెప్పింది. వృత్తికి అంకితమవుతాడంటూ ప్రశంసల జల్లు కురిపించింది.