పని మొదలెట్టాడు! | started working | Sakshi
Sakshi News home page

పని మొదలెట్టాడు!

Published Wed, Jan 7 2015 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

పని మొదలెట్టాడు!

పని మొదలెట్టాడు!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బయోగ్రఫికల్ మూవీ కోసం హీరో ఇమ్రాన్ హష్మీ అప్పుడే పని మొదలు పెట్టేశాడు. ఆటలో అజహర్‌లా వెండి తెరపై జీవించాలని తపన పడుతున్నాడు. అందులో భాగంగా ఈ ‘ముద్దుల’ హీరో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సిడ్నీ వెళ్లాడట.

మోహిత్ సూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హమారీ అధూరీ కహానీ’ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నేరుగా సిడ్నీ ఫ్లయిట్ పట్టుకున్నాడట ఇమ్రాన్. టీవీలో కంటే ప్రత్యక్షంగా చూస్తేనే ఒరిజినాలిటీ అర్థమవుతుందనేది మనోడి అభిప్రాయమట. ఈ సినిమాలో అజహర్ మొదటి భార్య నౌరీన్‌గా ప్రచీదేశాయ్, సంగీతా బిజిలానీగా కరీనాకపూర్ చేస్తున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement