
దివంగత నటి, ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లోని స్టార్ క్యాస్ట్ రోజురోజుకీ పెద్దదవుతోంది. జయలలితగా కంగనా రనౌత్, యంజీఆర్‌గా అరవింద స్వామి, శశికళ పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. కరుణానిధిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారట. తాజాగా శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూసేన్ గుప్తా నటిస్తారని తెలిసింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. శోభన్‌బాబు, జయలలిత కొంతకాలం ప్రేమలో ఉన్నారని అప్పట్లో టాక్. శోభన్‌బాబు పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉండబోతోందట. ఈ పాత్రను పోషించడానికి శోభన్‌బాబు పాత చిత్రాలను చూస్తున్నారట జిష్షూ సేన్. యన్‌టీఆర్ బయోపిక్‌లో ఎల్వీ ప్రసాద్ పాత్రలో, ‘అశ్వథ్థామ’ లో విలన్ పాత్రలో నటించారు జిష్షూ.
Comments
Please login to add a commentAdd a comment