Jisshu Sengupta
-
బెంగాలీ బాబు శోభన్‌బాబు
దివంగత నటి, ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లోని స్టార్ క్యాస్ట్ రోజురోజుకీ పెద్దదవుతోంది. జయలలితగా కంగనా రనౌత్, యంజీఆర్‌గా అరవింద స్వామి, శశికళ పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. కరుణానిధిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారట. తాజాగా శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూసేన్ గుప్తా నటిస్తారని తెలిసింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. శోభన్‌బాబు, జయలలిత కొంతకాలం ప్రేమలో ఉన్నారని అప్పట్లో టాక్. శోభన్‌బాబు పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉండబోతోందట. ఈ పాత్రను పోషించడానికి శోభన్‌బాబు పాత చిత్రాలను చూస్తున్నారట జిష్షూ సేన్. యన్టీఆర్ బయోపిక్‌లో ఎల్వీ ప్రసాద్ పాత్రలో, ‘అశ్వథ్థామ’ లో విలన్ పాత్రలో నటించారు జిష్షూ. -
‘ఎన్టీఆర్’లో బెంగాలీ నటుడు
నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమా కోసం ఓ బెంగాలీ నటుడ్ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్ భర్తగా నటిస్తున్న జిష్షు సేన్‌గుప్తాను ఎన్టీఆర్‌లో కీలకపాత్రలకు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ నటుడిగా ఎదుగుతున్న రోజుల్లో ప్రొత్సహించిన ఎల్వీ ప్రసాద్ పాత్రలో జిష్షు కనిపించనున్నారు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ బాలీవుడ్ నటి విద్యాబాలన్, రానా దగ్గుబాటి, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్రలో నటించనున్నారు.