
ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ నివారణకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు విధించాయి. అయితే ప్రభుత్వం క్రమక్రమంగా లాక్‌డౌన్ ఎత్తేయడంతో అన్ని రంగాలు కార్యకలాపాలు ప్రారంభించాయి. కాగా సినీ పరిశ్రమ కూడా షూటింగ్‌ల ప్రారంభానికి సిద్దమవుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్(తలైవి)లో బాలీవుడ్ అగ్రనటి కంగనా రనౌత్ నటిస్తున్నారు. జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన తలైవి పోస్టర్లను ఉత్కంఠ కలిగిస్తున్నాయి.
కరోనా కారణంగా వాయిదా పడ్డ తలైవి సినిమా షూటింగ్ నేడు ప్రారంభించినట్లు కంగనా తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తుండగా, విష్ణువర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తలైవి షూటింగ్ ప్రారంభం అవ్వడం తనకెంతో సంతోషమని, తన సినీ కెరీర్‌లోనే తలైవి ప్రతిష్టాత్మక చిత్రమని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే తలైవి పోస్టర్ గత నవంబర్‌లో విడుదలైన విషయం తెలిసిందే. (చదవండి: క్షమాపణ చెప్పి శాశ్వతంగా వెళ్లిపోతా : కంగనా)