ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. 'గత కొన్ని రోజులుగా శరీరం చాలా నీరసంగా, కళ్లు మండుతున్నట్లు అనిపించింది. హిమాచల్‌ప్రదేశ్ వెళ్తాం అనుకున్నాం. సో ముందు జాగ్రత్తగా టెస్టు చేయించుకోగా నేడు (శనివారం)టెస్టు రిపోర్ట్స్ వచ్చాయి. అందులో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే క్వారంటైన్ అయిపోయాను. నా బాడీలో వైరస్ పార్టీ చేసుకుంటుందనే విషయం నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను ఈ వైరస్‌ను నాశనం చేస్తాను. మీరు కూడా వైరస్‌కు భయపడకండి. ఒకవేళ మీరు భయపడితే ఆ వైరస్ మిమ్మల్ని ఇంకా భయపెడుతుంది. కరోనా అనేది జస్ట్ చిన్న ఫ్లూ.. తప్పా మరేం కాదు కాబట్టి రండి కలిసి ఈ వైరస్‌ను నాశనం చేద్దాం' అని పేర్కొంది.
ఇక కొద్ది రోజుల క్రితమే కంగనా రనౌత్ అఖౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా వరుస ట్వీట్లు చేసినందునే ఆమె అకౌంట్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది.పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత తీవ్రస్థాయిలో హింస జరుగుతోందంటూ ఆమె పలు వీడియోలను, సందేశాలను అభిమానులతో పంచుకుంది.అయితే ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపడంతో ట్విటర్ ఆమె ఖాతాను నిలిపివేసింది. ఊహించని చర్యతో ఖంగు తిన్న కంగనా కన్నీళ్లు పెట్టుకుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని నిలువునా పాతిపెట్టడమేనని విమర్శించిన సంగతి తెలిసిందే.
చదవండి : బాలీవుడ్ హీరోయిన్‌కు షాకిచ్చిన ట్విటర్
కంగనా రనౌత్ కీలక నిర్ణయం.. ‘మణికర్ణిక’గా నామకరణం
Comments
Please login to add a commentAdd a comment